ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (11:29 IST)

ఒబిసిటీకి జీలకర్ర దివ్యౌషధం.. పెరుగు, మజ్జిగలో కలిపి తీసుకుంటే?

ఒబిసిటీకి జీలకర్ర దివ్యౌషధంగా పనిచేస్తుంది. గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే కడుపులో మంట తగ్గిపోతుంది. కడుపులోని రసాయనాలు మనం తిన్న ఆహారాన్ని వేగంగా షుగర్‌గా మారుస్తాయి. అయితే జీరా తీసుకుంటే

ఒబిసిటీకి జీలకర్ర దివ్యౌషధంగా పనిచేస్తుంది. గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే కడుపులో మంట తగ్గిపోతుంది. కడుపులోని రసాయనాలు మనం తిన్న ఆహారాన్ని వేగంగా షుగర్‌గా మారుస్తాయి. అయితే జీరా తీసుకుంటే అది రక్తంలోని షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. తద్వారా మధుమేహాన్ని అదుపు చేయడంతో పాటు బరువును కూడా తగ్గించుకోవచ్చు. 
 
అలాగే బరువు తగ్గాలనుకునేరావు రెగ్యులర్‌ డ్రింకింగ్‌ వాటర్‌కు బదులుగా జీరా నీటిని తీసుకోవాలి. ఒక స్పూను జీరాను గ్లాసు నీటిలో ఉడికించాలి. గ్లాసు నీళ్లు అరగ్లాసు అయ్యేదాకా ఉడికించవచ్చు. ఆ నీటిని ఉదయమే తాగితే మంచి ఫలితం ఉంటుంది. రుచి కోసం ఆ నీటిలో కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు.
 
కడుపులో గ్యాసును పెంచే ఆలూ వంటివి వండినప్పుడు ఆ వంటకాలలో కాస్త జీరా కలిపితే మంచిది. చల్లటి మజ్జిగపై జీరా పొడిని చిలకరించి తీసుకుంటే.. సులభంగా బరువు తగ్గుతారు. ఇంకా భోజనంలో తీసుకునే పెరుగులో వేగించిన జీలకర్రను చల్లి తినొచ్చు. పిండిలో జీలకర్ర పొడిని కలిపి చేసిన చపాతీలు కూడా ఆరోగ్యకరమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.