సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (15:29 IST)

నడుము నాజూగ్గా మారాలంటే.. పాప్‌కార్న్ తినాల్సిందే..

నడుము నాజూగ్గా మారాలంటే.. పాప్‌కార్న్ తినాల్సిందేనని న్యూట్రీషియన్లు అంటున్నారు. పాప్‌‌కార్న్‌లో ఎక్కువగా పీచుపదార్థాలు, యాంటీ యాక్సిడెంట్లు వుంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో లభిస్తాయి. పైగా వ

నడుము నాజూగ్గా మారాలంటే.. పాప్‌కార్న్ తినాల్సిందేనని న్యూట్రీషియన్లు అంటున్నారు. పాప్‌‌కార్న్‌లో ఎక్కువగా పీచుపదార్థాలు, యాంటీ యాక్సిడెంట్లు వుంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో లభిస్తాయి. పైగా వీటిని ఎక్కువ రోజులు నిల్వ వుండేలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అందుకే వీటిని ప్యాక్ చేసుకుని ఆఫీసులకు, కాలేజీలకు పట్టుకెళ్లవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పాప్‌కార్న్‌లో ఫైబర్ అధికంగా వుంది. మిగిలిన తృణధాన్యాలతో పోల్చితే పాప్‌కార్న్‌లో ఫైబర్ శాతం అధికంగా వుంటుంది. ఇంకా పాప్‌కార్న్ నూనెలో వేపకపోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంకా పాప్ కార్న్ క్యాన్సర్ కారకాలను దూరం చేస్తుంది. పాలిఫెనాల్స్ పాప్‌కార్న్‌లో అధికంగా వుండటం ద్వారా పాప్ కార్న్‌ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. 
 
పాప్‌కార్న్‌లో కెలోరీల శాతం తక్కువ. అయితే థియేటర్లలో దొరికే చీస్, బటర్ పాప్‌కార్న్‌ను అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఇంట్లోనే తయారు చేసే పాప్‌కార్న్ ద్వారానే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
పాప్ కార్న్‌తో పాటు పండ్లు, కూరగాయలను స్నాక్స్‌గా తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. ఆకలేస్తే చాలు బేకరీకో, కాఫీషాప్‌కో పరుగెట్టి, అక్కడ పిజానో, బర్గరో తిని ఓ కూల్‌ డ్రింక్‌ తాగేస్తే కడుపు నిండిపోతుంది. కానీ వాటిల్లోని కార్బోహైడ్రేట్‌లూ, షుగర్‌లూ అధిక బరువుని పెంచేస్తాయి. 
 
అలాంటప్పుడు వాటికి బదులుగా ఓ జామకాయనో, యాపిల్‌నో, అరటిపండునో తీసుకుంటే బరువు పెరగరు. శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.  కొలెస్ట్రాల్‌ సమస్యే ఉండదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.