గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (10:47 IST)

రాత్రిపూట అరటి పండు తీసుకుంటే.. జలుబు చేస్తుందా?

రాత్రిపూట అరటి పండు తీసుకుంటున్నారా? అయితే ఇక తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపులో మంటగా వుంటే అరటి పండు తీసుకోవచ్చు. కానీ అరటి పండును రాత్రి పూట భోజనం చేసిన తర్వాత మాత్రం తీసుకోకూడదు. ఎందు

రాత్రిపూట అరటి పండు తీసుకుంటున్నారా? అయితే ఇక తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపులో మంటగా వుంటే అరటి పండు తీసుకోవచ్చు. కానీ అరటి పండును రాత్రి పూట భోజనం చేసిన తర్వాత మాత్రం తీసుకోకూడదు.


ఎందుకంటే.. ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడటానికి జలుబుకి ఇది దారితీస్తుంది. అందుకే రాత్రిపూట అరటి పండును తీసుకోకూడదు. ఇందుకు బదులుగా మధ్యాహ్నం పూట అరటి పండును తీసుకోవడం మంచిది. అలాగే ఖాళీ కడుపుతో అరటి పండును తీసుకుంటే అసౌకర్యానికి లోనవుతారు. 
 
ఇక అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే త్వరగా జీర్ణం అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు కలిగిస్తుంది. ఇది సహజ యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. మధ్యాహ్నం పూట రోజూ ఒక అరటి పండును తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి. 
 
అరటి పండ్లలో ఉండే మెగ్నిషియం కండరాలు దృఢంగా మారేందుకు ఉపయోగపడుతుంది. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. అరటి పండ్లలో ఉండే విటమిన్ బి9 మన శరీరంలో సెరటోనిన్ లెవల్స్‌ను పెంచుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.