సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 16 మే 2018 (13:08 IST)

కీరదోస నీటిని తాగితే.. మేలెంతో తెలుసా?

కీరదోస నీటిని వేసవిలో తీసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. కీరదోస పలుచని ముక్కలుగా కోసి తాగే నీటిలో వేసుకోవాలి. అరగంట తర్వాత తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రుచి కోసం కాస్త నిమ్మర

కీరదోస నీటిని వేసవిలో తీసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. కీరదోస పలుచని ముక్కలుగా కోసి తాగే నీటిలో వేసుకోవాలి. అరగంట తర్వాత తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రుచి కోసం కాస్త నిమ్మరసం కూడా కలుపుకుంటే టేస్టు అదిరిపోతుంది. కీర దోస నీటిని సేవించడం ద్వారా వేసవిలో డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా ఉంటుంది.
 
బరువును తగ్గించడంలో కీరదోస మెరుగ్గా పనిచేస్తుంది. ఆకలిగా అనిపించినప్పుడు కీరదోస నీళ్లు తాగితే పొట్టినిండినట్లుంది. ఈ నీటిలో పుష్కలంగా ఉండే విటమిన్‌-కె, మాంసకృత్తులు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్‌ సి మాంగనీసు, బీటాకెరోటిన్‌ గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.
 
నోటి నుంచి దుర్వాసన వస్తుంటే కీర దోస నీటిని క్రమం తప్పకుండా తాగడం చేస్తే మంచి ఫలితం వుంటుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కీరదోస నీటిని రోజు ఐదు లేదా ఆరు గ్లాసులు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఈ నీటిని సేవించడం ద్వారా శరీరంలోని మలినాలను తొలగించుకోవచ్చు. ఇది శ్వాస సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.