గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 15 మే 2018 (15:36 IST)

వేసవిలో అందానికి ఆరోగ్యానికి "మల్లెపూలు" వైద్యం...

వేసవిలో సాయంకాలాల్లో ఇంటికి సువాసనలిచ్చే మల్లెపూల గురించి, మహిళల జడల్లో తళ తళ మెరిసి పోయే మల్లెల గురించి తెలుసుకుందాం. చల్లదనానికి, కమ్మదనానికి, సౌందర్య వికాసానికి, మరులు గొలిపే గుబాళింపులకు మారుపేరైన

వేసవిలో సాయంకాలాల్లో ఇంటికి సువాసనలిచ్చే మల్లెపూల గురించి, మహిళల జడల్లో తళ తళ మెరిసి పోయే మల్లెల గురించి తెలుసుకుందాం. చల్లదనానికి, కమ్మదనానికి, సౌందర్య వికాసానికి, మరులు గొలిపే గుబాళింపులకు మారుపేరైన మల్లెపూలు ఔషధంలాగా, సౌందర్యంగా ఉపయోగపడుతుంది. అలాంటి మల్లెలు మనకు అందించే ఇతర ప్రయోజనాలను చూద్దాం. 
 
పరిమళానికి, సోయగానికి, స్వచ్చమైన ధవళ కాంతులకు మారుపేరైన మల్లెపూలు స్త్రీల సిగలో సహజ ఆభరణాలుగా మాత్రమే బ్రతుకు ముగించుకుంటాయని అనుకోవటం చాలా పొరపాటు. తలలో ధరించటానికి, దేవుని పటాలను అలకిచడానికి, పెళ్లి వేదికలను ఆకర్షణీయంగా చేయటంలోనూ మల్లెలు చాలా ఉపయోగపడుతాయి. 
 
రోజంతా శారీరక కష్టంతో అలసి పోయిన శరీరాన్ని సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని నింపి, మధురానుభూతులను పంచే మల్లెల గుబాళి నడుమ హాయిగా కునుకు పట్టేస్తుంది. అలసిన కనురెప్పలపై మల్లెలను కొద్దిసేపు పరిచి ఉంచితే చలువ చేస్తాయి. బాగా నిద్రపడుతుంది. పరిమళ భరిత మల్లెపూవుల్ని ఎన్నో సుగంధ సాధనాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
 
సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాలు, అగరు బత్తీల తయారీల్లో మల్లెపూలను ఉపయోగిస్తారు. సెంట్లు, ఫర్‌ఫ్యూమ్‌లలో అయితే మల్లెపూలను విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి, మరిగే వరకూ కాచి వడగట్టి వాడితే తల సువాసనభరితం కావడమే కాకుండా క్లేశాలకు మంచి పోషణ అవుతుంది. మాడుకు మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల తలనొప్పి వంటి వాటిని ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్యానికి అన్నివిధాలుగా సహాయపడుతుంది.