శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : బుధవారం, 16 మే 2018 (11:36 IST)

మామిడిని తిన్నాక టెంకను పారేస్తున్నారా? కాస్త ఆగండి..

మామిడిని తిన్నాక టెంకను పారేస్తున్నారా? అయితే ఇక అలా చేయకండి. మామిడి టెంకను పొడి చేసుకుని, జీలకర్ర, మెంతుల పొడితో సమంగా తీసుకుని కూరలా తయారు చేసి వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే శరీర ఉష్ణం తగ్గుతుందని..

మామిడిని తిన్నాక టెంకను పారేస్తున్నారా? అయితే ఇక అలా చేయకండి. మామిడి టెంకను పొడి చేసుకుని, జీలకర్ర, మెంతుల పొడితో సమంగా తీసుకుని కూరలా తయారు చేసి వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే శరీర ఉష్ణం తగ్గుతుందని.. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మామిడి టెంకను పొడిని మజ్జిగలో కలుపుకుని కాసింత ఉప్పు చేర్చి తాగితే.. తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే మామిడి టెంకలోని పప్పుని ఎండబెట్టి.. ఆ తర్వాత చూర్ణం చేసి, 3 గ్రాముల చొప్పున రోజుకు రెండు సార్లు తేనెతో సేవిస్తే, ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. పలు దగ్గు సమస్యలు హరిస్తాయి. అలాగే మామిడి టెంకలో జీడి చూర్ణాన్ని రెండు గ్రాముల పంచదారతో రోజూ రెండు సార్లు సేవిస్తే, తెల్లబట్టతో పాటు, కడుపులోని మంట తగ్గుతుంది.

ఇంకా మామిడి టెంకలోని జీడి పొడిని తలపైన పూస్తే చుండ్రు తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మామిడి టెంక పొడి బరువును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. 
 
అలాగే గుండెకు మేలు చేస్తుంది. మామిడి టెంకలోని ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి. ఎండిన మామిడి టెంకను పొడి చేసుకుని కొబ్బరి, ఆలివ్, ఆవనూనెతో కలిపి.. ఎండలో వారం పాటు ఎండ నివ్వాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని రోజూ ఉపయోగించే నూనెలో వేసుకోవాలి. ఈ మిశ్రమంతో బాగా నానిన కొబ్బరి నూనెను రోజూ తలకు పట్టించడం ద్వారా జుట్టు నెరవవు. 
 
హెయిర్ ఫాల్ వుండదు. జుట్టు వత్తుగా పెరుగుతాయి. అలాగే మామిడి టెంక పొడితో కాస్త బటర్ చేర్చి ముఖానికి పూతలా వేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ఈ మిశ్రమాన్నిలిప్ బామ్‌గా కూడా ఉపయోగించవచ్చు. అలాగే మామిడి టెంకల పొడికి టమోటా రసాన్ని జతచేసి ముఖానికి రాసుకోవచ్చు. ఇది చర్మానికి మంచి స్క్రబ్‌గా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.