శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (11:59 IST)

క్యారెట్ జ్యూస్ ‌తీసుకుంటే.. కీళ్ళనొప్పులు, ఒబిసిటీ మటాష్

క్యారెట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. అదీ వేసవిలో క్యారెట్ జ్యూస్ తాగితే అలసట తొలగిపోతుంది. పలుచగా క్యారెట్ ముక్కలను గ్రైండ్ చేసుకుని.. చెంచా అల్లం జ్యూస్, నిమ్మరసం రెండు స్పూన్లు, కొ

క్యారెట్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. అదీ వేసవిలో క్యారెట్ జ్యూస్ తాగితే అలసట తొలగిపోతుంది. పలుచగా క్యారెట్ ముక్కలను గ్రైండ్ చేసుకుని.. చెంచా అల్లం జ్యూస్, నిమ్మరసం రెండు స్పూన్లు, కొద్దిగా తేనె వేసి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా వుంటుంది.


ఇంకా డీహైడ్రేషన్ సమస్యలుండవు. క్యారెట్‌లో ఏ, సి, కె విటమిన్లూ, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఏ విటమిన్‌ ఊపిరితిత్తుల్లో కఫం చేరకుండా చేస్తుంది. ఇక, సి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
క్యారెట్‌ రసాన్ని తరచూ తీసుకోవడమే కాదు, అందులో కాస్త తేనె కలిపి తీసుకుంటే.. జలుబు, గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలూ దృఢంగా మారాలంటే రోజూ ఒక గ్లాసుడు క్యారెట్ రసం తీసుకోవాల్సిందే. ఇంకా క్యారెట్ జ్యూస్ కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే చర్మసంబంధిత అనారోగ్యాలూ దూరమవుతాయి.
 
జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం తాజాగా కనిపించాలన్నా... క్యారెట్‌ రసాన్ని తీసుకోవాల్సిందే. ఇంకా ఒబిసిటీ దూరం కావాలంటే.. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ఉత్తమం అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.