శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. యోగా
  3. ఆసనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 14 జూన్ 2018 (19:39 IST)

యోగా సాధన నియమనిబంధనలు...

యోగా సాధన చేయడానికి మానసిక, శారీరక సంసిద్ధతను కలిగి ఉండాలి. యోగా సాధన అనేది శ్వాస సంబంధిత వ్యాయామాలతో ప్రారంభిస్తారు. తద్వారా మెదడుకు ప్రశాంతతను చేకూర్చి, మూసుకుపోయిన శ్వాసకోశ నాళాలను తెరుచుకుంటాయి.

యోగా సాధన చేయడానికి మానసిక, శారీరక సంసిద్ధతను కలిగి ఉండాలి. యోగా సాధన అనేది శ్వాస సంబంధిత వ్యాయామాలతో ప్రారంభిస్తారు. తద్వారా మెదడుకు ప్రశాంతతను చేకూర్చి, మూసుకుపోయిన శ్వాసకోశ నాళాలను తెరుచుకుంటాయి.
 
యోగాసాధనలో శరీర కదలికలకు ఆటంకాలు కలుగని రీతిలో వస్త్రధారణ చేయాలి. సాధారణంగా తేలికైన, వదులైన వస్త్రాలు యోగాసనాలు వేసేటప్పుడు అనువుగా ఉంటాయి. యోగాసనాలు చేసేముందుగా వాచ్చీ, కళ్ళజోడు, ఆభరణాలు, నగలను పక్కన పెట్టుకుని ఆ తరువాత యోగాసనాలు ప్రారంభం చేయాలి.
 
యోగా చేయడానికి స్థలాలు నేరుగా సూర్యకాంతి ప్రభావానికి గురికాని విధంగా శుభ్రమైన, దారాళమైన వెలుతురు పుష్కలంగా ఉండాలి. గాలి తగిలే స్థలంలో చాపలను వేసుకుని యోగాసనాలను చేస్తే మంచిది. ఆసనాలు వేసే ముందుగా స్నానం చేయాలి. యోగాసనాలు వేసేటపుడు మీ శ్వాసప్రక్రియ ముక్కుతోనే జరగాలి. ఆరంభంలో చిన్నపాటి వ్యాయామాలతో మెుదలు పెట్టితే మంచిది. ఆ తరువాత రోజువారీ యోగాసనాలు వేస్తే మంచిది. 
 
యోగాసాధన ప్రారంభించడాని ముందుగా రెండు గంటల వరకు ఎటువంటి ఆహారాన్ని, నీరును తీసుకోకూడదు. యోగాసాధన సమయంలో నీరు త్రాగడం మంచిది కాదు. ధ్యానంతోనే యోగాసాధనను ముగించాలి. భుజాలు, కాళ్ళు, యావత్ దేహానికి మాలాము పట్టడం ద్వారా యోగసాధన కార్యక్రమానికి ముగింపు పలకాలి. నిద్రకు ఉపక్రమించే ముందుగా యోగసాధన చేయకూడదు.