గర్భిణులు తప్పకుండా ఈ జ్యూస్ తప్పకుండా తీసుకోవాలట..
మహిళలు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారు. పోషకాహారం సరిగ్గా తీసుకోవాలి. ఈ సమయంలో ఎంతగా శ్రద్ధ తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు, అలాగే తన ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుంది.
పండ్లు, అలాగే పండ్ల రసాలను తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా నారింజ పండు జ్యూస్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ జ్యూస్‌లో విటమిన్ సి, ఫోలేట్ అధిక స్థాయిలో ఉంటాయి.
బిడ్డ ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. విటమిన్ సి వల్ల ఐరన్ బాగా గ్రహిస్తుంది, దీని వల్ల రక్తహీనత సమస్య కూడా రాకుండా ఉంటుంది.
గర్భధారణ సమయంలో హైబీపీ మరియు నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. నారింజ జ్యూస్ ఇటువంటి సమస్యలను దూరం చేస్తుంది.