దాల్చిన చెక్కని వేసి కాచిన నీటిని తాగితే...
దగ్గు నుంచి ఉపశమనానికి తులసి ఆకులను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవాలి. వెన్నునొప్పితో బాధపడుతుంటే అల్లం పేస్టుతో మర్దన చేస్తే తగ్గుతుంది.
దగ్గు ఎక్కువైనప్పుడు ఛాతీ నొప్పి వస్తుంటుంది. ఇది తగ్గాలంటే మూడు కప్పుల నీళ్ళలో రెండు తమలపాకులు నాలుగు మిరియాలు వేసి సగం అయ్యే వరకు నీటిని కాచాలి. ఈ నీటిని ప్రతీరోజు ఉదయం ఒక టీ స్పూన్ తేనెతో కలుపుకొని తాగాలి.
దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు గొంతు గరగర తగ్గాలంటే లవంగాన్ని చప్పరించాలి.
దాల్చిన చెక్కని వేసి కాచిన నీటిని తాగుతుంటే వాంతులు తగ్గుతాయి.
దేహంలో కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత రాకుండా నియంత్రిస్తుంది.
దోమకాటు వల్ల ఏర్పడిన దద్దుర్లు పోవాలంటే వాటి మీద ఉల్లిపాయ ముక్కతో రుద్దాలి.