శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 27 మార్చి 2020 (23:16 IST)

గ్యాస్ట్రిక్ దోషాలు వున్నవారికి ఇది మంచి మందు

డయేరియా, పంటినొప్పి, కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తీ దాల్చిన చెక్కకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయని వైద్యులు చెబుతుంటారు. అందుకే దీనిని కొన్నిరకాల అరోమా నూనెలు, రూం ఫ్రెషనర్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
 
దాల్చిన చెక్కలో కరిగిపోయే పీచుతోపాటు ఇనుము, క్యాల్షియం, మాంగనీస్‌, సి, కె విటమిన్లు లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్‌ సుగుణాలు ఆహారాన్ని ఎక్కువసేపు తాజాగా ఉంచుతాయి. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాకుండా జలుబును కూడా దాల్చినచెక్క నివారిస్తుంది.
 
మహిళల్లో రుతు సంబంధ వ్యాధుల నివారణకు దాల్చిన దివ్య ఔషధంలా పని చేస్తుంది. దీన్ని తీసుకోవటంవల్ల రుతుస్రావం సరైన సమయంలో వచ్చేలా చేస్తుంది. గర్భదోషాలను కూడా మాయం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి కూడా ఇది మంచి ఔషధం. 
 
దాల్చిన చెక్కను ఉడికించి, పేస్టు చేసి దాంట్లో కాస్తనెయ్యి, పటికబెల్లం కలిపి తీసుకుంటే జిగట విరేచనాలను నియంత్రించవచ్చు.