మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 22 జులై 2020 (22:15 IST)

కాకర, దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

కాకర కాయ మరియు దోసకాయ రెండూ వాటివాటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కాకరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెదడు ఆరోగ్యం మరియు కణజాల పనితీరును మెరుగుపరుస్తుంది.
 
ఇది ప్రొవిటమిన్ ఎను కలిగి ఉంటుంది. ఇది కంటిచూపు, చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేటప్పుడు, చెడు కొలెస్ట్రాల్ మరియు మొత్తం ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించేటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఇది సహాయపడుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. కాకర కాయ చర్మం మరియు జుట్టుకు కూడా ఉపయోగపడుతుంది.
 
దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు
దోసకాయలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో నీరు నిలుపుకోవడాన్ని నిరోధిస్తుంది. అలాగే శరీర వాపును తగ్గిస్తుంది. ఇది అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటుంది, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది.
 
ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తపోటు స్థాయిలను సరైన తీరులో వుంచేందుకు సహాయపడతాయి. దోసకాయలు కడుపులో అధిక వేడిని విడుదల చేయడంలో సహాయపడతాయి. కనుక కాకర, దోసకాయలను ఆహారంలో భాగం చేసుకుంటూ వుండాలి.