సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 16 జులై 2020 (21:45 IST)

ఈ కరోనా కాలంలో గుమ్మడి గింజలు తినాల్సిందే, ఎందుకంటే?

గుమ్మడి గింజల వలన కలిగే ఆరోగ్య ఫలితాలను తెలిస్తే వాటిని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటాం. గుమ్మడిలో న్యూట్రీషియన్స్, విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడిలో ఉండే విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీఆక్సిడెంట్స్, జింక్, మరియు మెగ్నీషియం మొత్తం శరీర ఆరోగ్యనికి మేలు చేస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. 
 
గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయి. ఎటువంటి క్యాన్సర్ అయినా సరే గుమ్మడి గింజలు నివారిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్‌లను నివారించగలిగే రోగనిరోధక శక్తిని ఇవి కలిగి ఉంటాయి. ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది.
 
డయాబెటీస్ రాకుండా నివారించేందుకు, వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది . గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారిలో కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
 
గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వివిధ రకాల నొప్పులు మరియు బాధలు నుండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా విముక్తి పొందవచ్చు.