మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (19:06 IST)

మిరియాలతో కలిపి తమలపాకు వేసుకుంటే ఏమవుతుంది? (video)

ప్రకృతి నుంచి మనకు సహజసిద్ధంగా ఎన్నో వనమూలికలు లభ్యమవుతున్నాయి. మన దేశంలో లభించే వనమూలికలు మరెక్కడా లభించవంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనామహమ్మారిని ఇండియా ఎదుర్కోగలుగుతుంది. మిరియాలతో చేసిన కషాయం కరోనావైరస్ రాకుండా వుండేందుకు రోగనిరోధక శక్తిని పెంపు చేస్తోంది.
 
ఈ మిరియాలను తమలపాకుతో తీసుకుంటే స్థూలకాయం తగ్గుముఖం పడుతుంది. ఇంకా దీని వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు  ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. అధిక బరువుతో సతమతమయ్యే వారు రెండు నెలల పాటు రోజూ ఒక తమలపాకు, పది గ్రాముల మిరియాలు కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 
2. తలనొప్పితో ఇబ్బంది పడేవారు తమలపాకు రసాన్ని తీసి ముక్కులో వేసుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
 
3. తమలపాకులను ముద్దగా నూరి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
 
4. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు ఆకుకూరలు ఎలా మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే మేలు చేస్తాయి.
 
5. తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల వృద్ధాప్యపు ఛాయలు కనిపించవు. నిల్వ చేసిన నూనెలు చెడిపోకుండా ఉండాలంటే వాటిలో తమలపాకులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
6. తమలపాకులోని చెవికాల్ అనే పదార్థం హానికారక బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుంది. ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఆయిల్ ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. 
 
7. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవటం మంచిది.