శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (19:11 IST)

జొన్నల్లో వుండే శక్తి ఎంతో తెలుసా? (video)

ఈమధ్య కాలంలో కూర్చుని పనిచేసే పనులే ఎక్కువయ్యాయి. గంటలకొద్దీ కుర్చీలకు అతుక్కుపోయి పని చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో చాలామంది చిరుతిళ్లు తినేసి వళ్లు పెంచేసుకుని ఆ తర్వాత అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఐతే జొన్నలతో చేసిన వంటకాలను తెచ్చుకుని తింటే సరి. ఎందుకంటే ఇవి కేలరీలను పెరగనీకు౦డా శక్తినిస్తాయి.
 
జొన్నపి౦డి ఏ ఇతర వ౦టక౦లోనయినా కలుపుకుని తినేయవచ్చు. ఇందులో 70 శాతానికి పైగా పిండిపదార్థం వుంటుంది. పైగా జొన్నలతో చేసిన వంటకాలు తేలిగ్గా జీర్ణమవుతాయి. జబ్బుపడినవారు త్వరగా కోలుకోవడానికి జొన్నలతో చేసిన పదార్థాలను పెట్టడం ఎంతో మంచిది.
 
అన్ని రకాల జొన్నలూ బాలింతలకు మంచి బలవర్థకమైన ఆహారంగా పనిచేస్తాయి. తగినంత పీచు ఉండడం వల్ల జీర్ణసమస్యలు రాకుండా ఉంటాయి. విలువలు కూడా జొన్నలోనే ఎక్కువ. వీటివల్ల 349 కిలోకేలరీల శక్తి లభిస్తుంది.