సంబంధిత వార్తలు
- మైక్రోసాఫ్ట్‌తో రిలయన్స్ జియో డీల్.. అజుర్ క్లౌడ్ సర్వీస్ ఫ్రీ
- విండోస్ ఫోన్లకు చెల్లుచీటి.. మైక్రోసాఫ్ట్ ప్రకటన
- వోల్ట్ టెక్నాలజీతో వస్తోన్న బీఎస్ఎన్ఎల్: జియోకు సవాలేనా? (video)
- జియో కామెంట్స్.. ల్యాండ్‌లైన్ నెంబర్లను మొబైల్ నెంబర్లుగా చూపిస్తారా?
- జియో కొత్త ఫీచర్.. వీడియో కాల్ అసిస్టెంట్ వచ్చేసింది..
మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్ అదుర్స్.. సత్య నాదెళ్లకు భారీ ఇంక్రిమెంట్
మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల ఒక ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఇందుకు కారణం తెలుగువాడైన సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టడమేనని తెలుస్తోంది. ఆయన సీఈవో అయినప్పటి నుంచి ఆ సంస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ.. లాభాలను ఆర్జిస్తోంది.
ఈ నేపథ్యంలో సత్య నాదెళ్లకు భారీగా ఇంక్రిమెంట్ లభించింది. ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది ఏకంగా 66 శాతం ఇంక్రిమెంట్ లభించింది.
మైక్రోసాఫ్ట్ వార్షిక నివేదికను అనుసరించి 2018-19 సంవత్సరానికి సత్య నాదెళ్లకు 42.9 మిలియన్ డాలర్ల వేతనం లభించింది. గడిచిన రెండేళ్లలో ఆయన వేతనం రెండింతలైనట్లు తెలుస్తోంది. 2016-17కు గానూ ఆయన 20 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుకోగా.. 2017-18కి 25 మిలియన్ డాలర్లు అందుకున్నారు.
సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరుణంలో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 302 బిలియన్ డాలర్లు ప్రస్తుతం 850 మిలియన్ డాలర్లకు చేరింది.
