1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Microsoft will stop supporting Windows 10 Mobile in December 2019

విండోస్ ఫోన్లకు చెల్లుచీటి.. మైక్రోసాఫ్ట్ ప్రకటన

Microsoft
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. విండోస్ ఫోన్లకు గుడ్‌బై చెప్పేసింది. పైగా, విండోస్ ఫోన్లను వాడుతున్న యూజర్లందరూ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లకు వారాలని సూచన చేసింది. ఇకపై విండోస్‌ 10 మొబైల్‌ ఇక సపోర్ట్‌‌ చేయవని తెలిపింది. 2019 డిసెంబరు నాటికి ఈ ఫోన్లు పూర్తిగా పనిచేయవని తెలిపింది. 
 
'ఎండ్‌ ఆఫ్‌ సపోర్ట్‌'’ పేజీలో విండోస్‌ 10 మొబైల్‌, డిసెంబర్‌ 10 తర్వాత కొత్త సెక్యురిటీ అప్‌ డేట్లను తీసుకోవడం మానేసిందని యూజర్లకు తెలిపింది. విండోస్‌ 10 మొబైల్‌ ఓఎస్‌ సపోర్ట్‌‌ చేయడం ముగియడంతో, కస్టమర్లు ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ డివైజ్‌‌లలోకి ఖచ్చితంగా మారాలని సూచన చేసింది.
 
కాగా, విండోస్ మొబైల్ 10 చివరి వెర్షన్‌ 1709. దీన్ని 2017వ సంవత్సరం అక్టోబరు నెలలో రిలీజ్ చేసింది. విండోస్‌ 10 మొబైల్‌‌ను ఆపివేస్తున్నామని 2017లోనే మైక్రోసాఫ్ట్‌‌ సంకేతాలిచ్చింది. దీని కోసం కొత్త ఫీచర్లను కానీ, హార్డ్‌‌వేర్‌ కానీ డెవలప్‌ చేయడం లేదని తెలిపింది. 
తర్వాతి కథనం
కన్హయ్యపై చార్జిషీటును తిరస్కరించిన ఢిల్లీ కోర్టు