జియో కొత్త ఫీచర్.. వీడియో కాల్ అసిస్టెంట్ వచ్చేసింది..

JioFi
సెల్వి| Last Updated: బుధవారం, 16 అక్టోబరు 2019 (11:22 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో కొత్త కొత్త ప్లాన్‌లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గత 2017వ సంవత్సరం రిలయన్స్ చీఫ్ ముకేష్ అంబానీ.. ఉచిత డేటాను అందించిన సంగతి తెలిసిందే. ఈ డేటా కోసం వొడాఫోన్, ఎయిర్‌టెల్ కస్టమర్లు కూడా జియోకు మారిపోయారు. దీంతో జియోకు పోటీగా ఇతర టెలికాం సంస్థలన్నీ డేటాతో ధరను తగ్గించాయి.

ఫలితంగా భారత్‌లో రిలయన్స్ డేటా వాడకం పెరిగింది. తాజాగా రిలయన్స్ ఫోన్లకు క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ ఫోన్లలో రిలయన్స్ జియో వీడియో కాల్ అసిస్టెంట్‌ అనే సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో Artficial Intelligence ద్వారా 4జీతో కస్టమర్ కేర్ అధికారులను సంప్రదించడం సులభమవుతుంది.

ఇదిలా ఉంటే.. వినియోగదారులకు జియో మరో ఫ్రీ ఆఫర్ తెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని చెప్పిన రెండ్రోజుల్లోనే.. జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ ఇవ్వనున్నట్లు జియో సంస్థ ప్రకటించింది.

కొత్త రీచార్జ్‌తో వడ్డింపు స్టార్ట్ అవుతుందని భావించిన వినియోగదారులు.. అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో.. తన ఖాతాదారులను కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ ప్రకటించింది జియో. తాజా ప్రకటన ద్వారా.. తొలిసారి రీచార్జ్ చేయించుకునన్న ఖాతాదారులకు 30 నిమిషాల పాటు ఉచిత టాక్‌టైం ఇవ్వనున్నట్టు పేర్కొంది.దీనిపై మరింత చదవండి :