శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (13:57 IST)

నెట్‌వర్క్ కాల్స్-కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జియో.. అయినా ట్రోలింగ్ ఆగలేదు..

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో... తాజాగా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే ఫోన్ కాల్స్ పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయబోతున్నామంటూ వినియోగదారులకు ఆ సంస్థ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తతో జియో కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. జియో ప్రస్తుతం గుడ్ న్యూస్‌తో ముందుకు వచ్చింది. 
 
ఇతర నెట్‌వర్క్‌కు  కాల్స్‌కు సంబంధించి 30 నిమిషాల ఉచిత టాక్ టైమ్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. తొలిసారి రీఛార్జ్ చేయించుకున్న ఖాతాదారులకు ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్లు జియో సంస్థ ప్రకటించింది. 
 
అయితే, రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన తొలి వారం రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని చెప్పింది.  అంటే తన నెట్‌వర్క్ పరిధిలో కాల్స్‌కి ఫ్రీ అయినా.. ఇతర నెట్‌వర్క్‌లకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తుండగా.. ఈ 30 నిమిషాల ఫ్రీ టాక్‌ టైం వారికి వర్తింజేయనుంది. అయితే.. ఈ ఆఫర్‌పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.