సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (12:39 IST)

11 అంకెలుగా మారనున్న మొబైల్ నంబర్లు?

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోను ఉంది. వారికో మొబైల్ నంబరు ఉంది. ఆ నంబరు పది అంకెలతో ఉంది. అలా పది అంకెలు కలిగిన మొబైల్ నంబర్లు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోట్లాదిలో ఉన్నాయి. అయితే, ఈ పది అంకెలతో కూడిన మొబైల్ నంబర్లు భవిష్యత్ డిమాండ్‌కు సరిపోయేలా లేవట. అందుకే పది అంకెల మొబైల్ నంబర్లను 11 అంకెలు గల మొబైల్ నంబర్లుగా మార్చాలని భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) యోచిస్తోంది. 
 
ప్రస్తుతం అమల్లో ఉన్న 10 అంకెల నంబర్లతో 210 కోట్ల మందికి సెల్‌ఫోన్‌ సేవలను అందించే అవకాశాలున్నాయి. భవిష్యత్‌లో నంబర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతమున్న నంబర్లను 11 అంకెలకు మార్చాలని ట్రాయ్‌ ఆలోచిస్తోంది. త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టయితే మొబైల్ నంబర్ల డిమాండ్ 2050 వరకు ఎలాంటి ఇబ్బంది  ఉండదని ట్రాయ్ భావిస్తోంది.