శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (09:14 IST)

దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు...

దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే.. వివిధ రకాల సెలవుల కారణంగా వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది. ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబరు రెండో తేదీ వరకు ఈ సెలవు రానున్నాయి. 
 
ఈ నెల 26, 27వ తేదీల్లో తమ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ తర్వాత 28వ తేదీన నాలుగో శనివారం కావడంతో బ్యాంకుల్లో ఎలాంటి సేవలు జరగవు. 29వ తేదీ ఆదివారం. 30వ తేదీన బ్యాంకులకు అర్థ సంవత్సరపు ముగింపు రోజు. సో.. ఆ రోజు కూడా బ్యాంకు సేవలు అందుబాటులోకి రావు. 
 
అక్టోబరు ఒకటో తేదీ మంగళవారం అయినప్పటికీ... అర్థ సంవత్సరపు అకౌంట్స్ ముగింపు లెక్కల్లో సిబ్బంది పాల్గొనడంతో ఒకటో తేదీన వారికి ఆప్షనల్ హాలిడే ఇచ్చే అవకాశం ఉంది. ఇక అక్టోబరు రెండో తేదీన గాంధీ జయంతి. సో... ఆ రోజు కూడా బ్యాంకులు పని చేయవు. ఫలితంగా ఈ నెల చివరి వారంలో వ్యాపార, నగదు లావాదేవీలు పెద్ద మొత్తంలో నిలిచిపోనున్నాయి.