సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (16:56 IST)

ఎయిర్‌టెల్ 'భరోసా సేవింగ్స్ ఖాతా' ప్రారంభం.. రూ.5 లక్షల ప్రమాద బీమా

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీగా ఉన్న ఎయిర్‌టెల్ తాజాగా తన వినియోగదారుల కోసం సరికొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ 'భరోసా సేవింగ్స్ అకౌంట్' పేరుతో దీన్ని మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ భరోసా ఖాతా అండర్ బ్యాంకు, అన్‌బ్యాంకు కస్టమర్ల ప్రత్యేకమైన అవసరాలను తీర్చనుంది భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ భరోసా సేవింగ్స్ ఖాతా కింద రూ.5 లక్షల మేరకు ప్రమాద బీమాను కూడా కల్పించనుంది. 
 
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాను రూ.500 నెలవారీ నిల్వ (బ్యాలెన్స్)తో నిర్వహించవచ్చు. దీనికింద ఐదు లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఉచితంగా అందివ్వనుంది. ఈ ఖాతా ద్వారా సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, నెలకు ఒక లావాదేవీ ఉచితం. అలాగే భరోసా ఖాతా ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందే లేదా, నగదు డిపాజిట్లు చేసే వినియోగదారులు క్యాష్‌బ్యాక్‌ కూడా సదుపాయాన్ని  కూడా పొందవచ్చు. 
  
దీనిపై ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు సీఎండీ అనుబ్రాతా బిస్వాస్ స్పందిస్తూ, భరోసా సేవింగ్స్‌ అకౌంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనీ, ఈ వినూత్న ఖాతాతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగం, లావాదేవీల అధికారిక బ్యాంకింగ్ విధానాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 
 
ఇది ఆర్థికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వినూత్నమైన, విభిన్నమైన పథకమన్నారు. భరోసా సేవింగ్స్ ఖాతా కస్టమర్లు భారతదేశం అంతటా 6,50,000 ఆధార్‌ ఎనేబుల్డ్  పేమెంట్‌ సిస్టం అవులెట్లలో నగదు ఉపసంహరించుకోవచ్చు, బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. మినీ స్టేట్‌మెంట్‌ను కూడా తీసుకోవచ్చని తెలిపారు.