బుధవారం, 29 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (19:40 IST)

హైద‌రాబాద్‌లో ‘ట్రెండ్స్ ఫుట్‌వేర్‌’... సరికొత్తగా 12 ఫుట్‌వేర్ స్టోర్లను ప్రారంభించిన రిలయన్స్ రీటైల్

హైద‌రాబాద్: రిల‌య‌న్స్ రీటైల్ త‌న అధునాతన ఫ్యాష‌న్ రీటైల్ స్టోర్ చైన్, ట్రెండ్స్ ఫుట్‌వేర్‌ను హైద‌రాబాద్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అట్ట‌హాసంగా ప్రారంభించింది. ప్ర‌తి ఒక్క‌రి మ‌రియు అంద‌రి అవ‌స‌రాలు తీర్చేలా అందుబాటులో ఉంచిన క‌లెక్ష‌న్ల‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఫ్యాష‌న్ ఫుట్‌వేర్ కేంద్రంగా రిల‌య‌న్స్ రీటైల్ ట్రెండ్స్ ఫుట్‌వేర్‌ను తీర్చిదిద్దింది.
 
ట్రెండ్స్ ఫుట్‌వేర్‌లో పురుషులు, స్త్రీలు మ‌రియు చిన్నారుల‌కు చెందిన లేటెస్ట్‌, వినూత్న‌మైన మ‌రియు ష్యాష‌న్ రంగంతో కూడిన అన్ని ఫుట్‌వేర్ ఉత్ప‌త్తులు అందుబాటులో ఉన్నాయి.సంస్థ‌లో అంత‌ర్గ‌తంగా రూపొందించిన ప్ర‌త్యేక‌మైన‌ బ్రాండ్లతో పాటుగా, దేశీయంగా అంత‌ర్జాతీయంగా పేరొందిన ప్ర‌తిష్టాత్మ‌క బ్రాండ్ల‌ను వినియోగ‌దారుల‌కు ట్రెండ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భార‌తీయ వినియోగ‌దారుల ఆకాంక్ష‌ల‌ను ప్ర‌ధానంగా దృష్టిలో ఉంచుకొని, ట్రెండ్స్ ఫుట్‌వేర్ నిత్యనూత‌న‌మైన ఉత్పాద‌న‌ల‌ను అందుబాటుల ధ‌ర‌ల్లో మ‌రియు లేటెస్ట్ ట్రెండ్స్‌ల‌లో అంద‌రికీ అందుబాటులో ఉండేలా తీసుకువస్తోంది.
 
ప్ర‌ముఖ సినీ న‌టీ ర‌కుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఎన్ఎస్ఎల్ కూక‌ట్‌ప‌ల్లి, హైద‌రాబాద్‌లో జ‌రిగిన ట్రెండ్స్ ఫుట్‌వేర్ స్టోర్ ప్రారంభోత్స‌వంలో రిల‌య‌న్స్ రీటైల్ లిమిటెడ్ సీఈఓ (ఫ్యాష‌న్ & లైఫ్‌స్టైల్‌) శ్రీ అఖిలేష్ ప్ర‌సాద్, శ్రీ నితీష్ కుమార్, హెడ్- ఫుట్‌వేర్‌( ఫ్యాష‌న్ & లైఫ్‌స్టైల్‌), రిల‌య‌న్స్ రీటైల్ లిమిటెడ్ తదిత‌రులు పాల్గొన్నారు.
 
ఈ నూత‌న స్టోర్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా సినీ నటి కుమారి ర‌కుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ``ట్రెండ్స్ ఫుట్‌వేర్ ప్రారంభోత్స‌వంలో నేను పాలుపంచుకోవ‌డం నాకెంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని క‌లిగిస్తోంది. అధునాత‌న ఫ్యాష‌న్‌ మ‌రియు ట్రెండీగా ఉన్న ఫుట్‌వేర్ ఉత్పాద‌న‌లు నాకెంతో న‌చ్చుతున్నాయి. అన్ని సంద‌ర్భాల‌కు త‌గిన రీతిలో వినియోగించే చెప్పులు, షూలు ఇక్క‌డ అందుబాటులో ఉన్నాయి. 
 
నిత్య జీవితంలోని అన్ని అవ‌స‌రాల‌కు త‌గిన రీతిలో ధ‌రించే విధంగా ఉన్నవి, క్యాజువ‌ల్స్‌, పార్టీ వియ‌ర్‌, ఎథ్నిక్ వియ‌ర్‌, హోం వియ‌ర్ మ‌రియు ఇత‌ర అన్ని కేట‌గిరీల‌వి అందుబాటు ధ‌ర‌ల్లో ఉంచారు. చిన్నారుల‌కు మ‌రియు పురుషుల‌కు సైతం న‌ప్పే ఎంతో ఉత్త‌మ‌మైన ఉత్పాద‌న‌లు ఉన్నాయి. ట్రెండ్స్ ఫుట్‌వేర్ యొక్క నూత‌న అడుగు వారికి మ‌రిన్ని విజ‌యాల‌ను సొంతం చేయాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను``అని స్ప‌ష్టం చేశారు.
 
అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా శ్రీ అఖిలేష్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, ``పెద్ద ఎత్తున ఉన్న భార‌తీయ వినియోగ‌దారుల ఆకాంక్ష‌లు నెర‌వేర్చేందుకు విస్తృత శ్రేణిలో ఉత్పాద‌న‌లు అందిస్తున్న స్టోర్‌గా ట్రెండ్స్ ఫుట్‌వేర్‌ను తీర్చిదిద్దాం. రిల‌య‌న్స్ రీటైల్ ద్వారా అందుబాటులోకి తీసుకువ‌చ్చిన ఈ మ‌రో కార్యాచ‌ర‌ణ‌తో అధునాత‌న‌మైన మ‌రియు ఉత్త‌మ‌మైన డిజైన్ల‌తో కూడిన ఉత్పాద‌న‌ల‌ను అందుబాటు ధ‌ర‌ల్లో వినియోగ‌దారులంద‌రికీ చేరువ‌లో ఉండేలా మేం కృషి చేశాం. భార‌త‌దేశ‌వ్యాప్తంగా 160 కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రైవేట్ లేబుల్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చాం. భార‌తదేశ‌వ్యాప్తంగా ఇదే అనుభూతిని మ‌రిన్ని చోట్ల అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నాం`` అని తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా శ్రీ ప్ర‌సాద్ మ‌రిన్ని అంశాలు పంచుకుంటూ ``వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ అవ‌డం మ‌రియు స‌రైన ఉత్పాద‌న‌ల‌ను అందుబాటు ధ‌ర‌ల్లో అందించ‌డం అనే ల‌క్ష్యంతో మేం ట్రెండ్స్ ఫుట్‌వేర్‌ను నిర్వ‌హిస్తున్నాం. ఈ నూత‌న స్టోర్ ద్వారా ఆక‌ర్ష‌ణీయ‌మైన మ‌రియు ష్యాష‌న్ రంగంతో కూడిన ఉత్పాద‌న‌ల‌ను చేరువ చేస్తున్నాం. ట్రెండ్స్ పుట్‌వేర్ ద్వారా అందించే ఉత్పాద‌న‌ల‌న్నీ అందుబాటు ధ‌ర‌ల్లో, అన్ని సంద‌ర్భాల‌కు త‌గిన రీతిలో కుటుంబం మొత్తం మెచ్చే రీతిలో ఉండ‌నున్నాయి.`` అని వివరించారు.
 
కూక‌ట్‌ప‌ల్లి ఎన్ఎస్ఎల్ సెంట్ర‌మ్ మాల్‌లో కాకుండా ట్రెండ్స్ ఫుట్‌వేర్ స్టోర్ల‌ను సిటీ సెంట‌ర్ మాల్ (బంజారాహిల్స్‌), డాక్ట‌ర్ ఏఎస్ రావు న‌గ‌ర్ మెయిన్ రోడ్, కోంప‌ల్లి (కుత్బుల్లాపూర్‌), శ‌ర‌త్‌సిటీ క్యాపిట‌ల్ మాల్ (కొత్త‌గూడ‌) వంటి చోట్ల ఉన్నాయి. ప్ర‌స్తుతం 160 ట్రెండ్స్ ఫుట్‌వేర్‌ స్టోర్లు భార‌తదేశ‌వ్యాప్తంగా ఉండ‌గా 40కి పైగా స్టోర్లు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి.