మోటోరోలా వన్ యాక్షన్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఎంత ప్రత్యేకమో చూడండి?
భారత్ మొబైల్ మార్కెట్‌లోకి రోజురోజుకీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే రియల్‌మి, షావోమీ సంస్థలు ఈ వారంలో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసాయి. తాజాగా మోటోరోలా కంపెనీ నుండి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. మోటోరోలా వన్ యాక్షన్ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి విడుదలైంది.
ఇది ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్. ఇందులో 21:9 వైడ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి ప్రత్యేకతలున్నాయి. మోటోరోలా వన్ విజన్ పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్ కొద్ది రోజుల క్రితమే భారత్‌లో రిలీజ్ అయింది. కాగా ఇప్పుడు వెంటనే మోటోరోలా వన్ యాక్షన్ రిలీజ్ చేయడం విశేషం. మోటోరోలా వన్ యాక్షన్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.13,999. ఆగస్ట్ 30వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయం ప్రారంభమవుతుంది.
మోటోరోలా వన్ యాక్షన్ ప్రత్యేకతలు
6.3 ఇంచ్‌ల ఫుల్ హెచ్‌డీ+ సినిమా విజన్ డిస్‌ప్లే
4 జీబీ ర్యామ్
128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
శాంసంగ్ ఎక్సినోస్ 9609 ప్రాసెసర్
12+5+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3,500 ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్
డ్యూయెల్ సిమ్ సిమ్ సపోర్ట్
ధర: 4జీబీ+128జీబీ- రూ.13,999