గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (16:30 IST)

బికినీ ఎయిర్‌లైన్స్‌ బంపర్ ఆఫర్... రూ.9కే టిక్కెట్

వియత్నాంకు చెందిన వియత్ జెట్ విమానయాన సంస్థ తన సేవలను భారత్‌లో విస్తరించనుంది. ఇప్పటికే బికినీ ఎయిర్‌లైన్స్‌గా గుర్తింపు పొందిన వియత్ జెట్ ఎయిర్‌లైన్స్... భారత్ - వియత్నాంల మధ్య విమాన సర్వీసులను వచ్చే డిసెంబరు నెలలో ప్రారంభించనుంది. 
 
డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచిమిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది. హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని సంస్థ వెల్లడించింది.
 
ఈ సర్వీసులు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్రి గోల్డెన్‌ డేస్‌ పేరుతో స్పెషల్‌ ప్రమోషన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ.9 ప్రారంభ ధరతో "సూపర్-సేవింగ్ టిక్కెట్లను" అందిస్తోంది. విస్తరిస్తున్న నెట్‌వర్క్‌లో భారతదేశం తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని వియత్‌జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్‌ తన్ సన్  తెలిపారు. 
 
కాగా వియత్‌జెట్ డిసెంబర్ 2011లో తన సేవలను ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు. అంతేకాదు, ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్‌లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి.