యువ్వనంగా ఉండాలంటే ఆ కాయను తినండి...
చాలా మంది వయసు మీదపడుతున్నా యవ్వనంగా ఉంటారు. దీనికి కారణం వారు పాటించే ఆహార నియమాలతో పాటు.. వ్యాయామం. అయితే, నిత్యం యవ్వనంగా ఉండాలంటే కొన్ని రకాల పండ్లను నిత్యం మన తీసుకునే ఆహారంలో తీసుకున్నట్టయితే మంచిదని డైటీషియన్లు చెబుతున్నారు.
ఇలాంటి కాయల్లో ఉసిరిక్కాయ ఒకటి. దీన్ని తినడం వల్ల యవ్వనంగా ఉంటారని అంటున్నారు. విటమిన్-సి కలిగిన ఉసిరికాయ ఆరోగ్యానికి ఎనర్జీ ఇస్తుందట. వ్యాధినిరోధక శక్తి అధికంగా గల ఉసిరికాయను మధుమేహ అనారోగ్యంతో ఉన్నవారు తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
అంతేకాకుండా, క్యాల్షియం, ఐరన్ శక్తుల్ని కలిగిన ఈ ఉసిరికాయ కేశ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా హెయిర్ ఫాల్‌ను కూడా నియంత్రిస్తుంది. హృద్రోగ సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది. అంతేగాకుండా కంటికి సంబంధించిన దృష్టి సమస్యలను కూడా ఉసిరికాయ దూరం చేస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. నీరసం, అజీర్ణానికి ఉసిరికాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది.
ఉసిరి కాయలో
ఫాట్ : 0.5 గ్రాములు
క్యాల్షియం - మి. గ్రాములు
పిండి పదార్థాలు : 14 గ్రాములు
ఇరన్ : 1 మి. గ్రా
విటమిన్ బి1 : 28 మి. గ్రాములు
విటమిన్ సి - 720 మి. గ్రాములు
కెలోరీలు : 60 ఉన్నాయి. అందుచేత ఉసిరికాయను ప్రతిరోజూ ఒకటి చొప్పున తీసుకుంటే నిత్య యవ్వనులుగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.