సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (10:53 IST)

చిరంజీవికి అతిపెద్ద అభిమానిని... ఆగలేకపోతున్నా : సైరాపై అమీర్ ఖాన్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". వచ్చే నెల రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా, సోషలో మీడియాలో సెన్సేషనల్ సృష్టిస్తోంది. ఈ ట్రైలర్‌ను వీక్షించిన అనేక మంది సినీ ప్రముఖులు చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఈ ట్రైలర్ చూసినట్టు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ఈ చిత్రం బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. "'సైరా' చిత్రం భారీ స్కేల్ మూవీ. చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. సినిమా చూసేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. చిరంజీవి స‌ర్‌, రామ్ చ‌ర‌ణ్‌, చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు" అని తన పోస్టులో అమీర్ ఖాన్ పేర్కొన్నారు.