వరుణ్ తేజ్ ఎవరిని కాపీ కొట్టాడో తెలుసా..?
మెగా హీరో వరుణ్‌తేజ్ - టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం వాల్మీకి. ఇందులో ఈ యువ కథానాయకుడు గద్దలకొండ గణేష్ పాత్రలో మెప్పించడానికి రెడీ అయ్యారు. సెప్టెంబర్ 20న వాల్మీకి చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్...వాల్మీకి చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఇంతకీ వాల్మీకి గురించి వరుణ్ తేజ్ ఏం చెప్పారంటే... ''సాధారణంగా డైరెక్టర్స్ నా దగ్గరికీ లవ్ స్టోరీనే చెప్పాలని వస్తారు. అయితే అప్పటికే ఫిదా, ఎఫ్ 2 సినిమాల్లో లవర్‌బోయ్‌గా కనపడటంతో లవ్ సినిమాలకు గ్యాప్ ఇద్దామని అనుకున్నాను.
ఆ సమయంలో హరీష్ గారు దాగుడుమూతలు కథతో నా దగ్గరకు వచ్చారు. ఆ కథ నచ్చింది. అయితే ఆయన స్టైల్లో ఓ సినిమా చేయాలనుందని ఆయనకు చెప్పాను. అప్పుడాయన తమిళ చిత్రం జిగర్‌తండా గురించి చెప్పారు. ఆ సినిమా చూడు తర్వాత మాట్లాడుదాం అన్నారు. నేను సినిమా చూశాను. సినిమా బాగా నచ్చింది. తర్వాత ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని మార్పులు చేర్పులు చేసుకున్నాం…
తమిళంలో బాబీ సింహ పాత్రను తెలుగులో నేను చేశాను. అసలు ఆ పాత్ర నెగెటివ్‌గా ఎందుకు మారిందనేది తమిళంలో చూపించలేదు. కాబట్టి హరీష్ తెలుగులో ఆ పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేశాడు. ఇక లుక్ విషయానికి వస్తే నేను చిరంజీవి గారి లుక్‌ను కాపీ కొట్టాను.
నిజానికి డాడీనే ఆ లుక్‌ను నాకు పంపారు. పునాదిరాళ్ళు సమయంలో డాడీ అలాగే ఉండేవారు. అదే హెయిర్ స్టైల్‌ను ఇందులో నేను ట్రై చేశాను. అలాగే సినిమా కథను కూడా ముందు చిరంజీవి గారికే వినిపించాం. ఆయనకు పాత్ర బాగా నచ్చింది. కొన్ని మార్పులు, చేర్పులు చెప్పారు.." అంటూ వరుణ్ తేజ్ అసలు విషయం బయటపెట్టారు.