గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (11:30 IST)

దర్శకేంద్రుడికి ముద్దుపెట్టిన బిందెను బహుమతిగా ఇచ్చిన భామ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం "వాల్మీకి". ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌ కాగా, హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రంలో 1982లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన "దేవత" చిత్రంలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మ' అనే పాటను రీమేక్ చేశారు. ఈ పాటకు సంబంధించి ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో దర్శకేంద్రుడు సమక్షంలో వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, ఈ పాటలో పూజా హెగ్డే నడుంపై పెట్టుకున్న బిందె కావాలంటూ చమత్కరించారు. ఈ మాటలు విన్న పూజా హెగ్డే.. వెంటనే లేచి.. తాను నడుముపై పెట్టుకున్న బిందెను ఇపుడు వెతకడం సాధ్యపడదనీ చెబుతూనే... ఆ బిందెల్లో ఓ బిందెను తీసుకుని దానిపై ముద్దు పెట్టి... దర్శకేంద్రుడికి బహుమతిగా ఇచ్చింది.
 
ఆ తర్వాత దర్శకేంద్రుడు మాటలు కొనసాగిస్తూ, పూజా హెగ్డేని చూసినరోజే ఈ అమ్మాయి టాప్‌ హీరోయిన్‌ అవుతుంది అన్నాను. వరుణ్‌ తేజ్ నటన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ తెలుసు. 15 ఏళ్ల క్రితం రామ్ అచంట.. గోపీ అచంట అనే నిర్మాతలతో కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాను. కానీ కుదరలేదు. ఈ విధంగా అవకాశం వచ్చినందుకు హ్యాపీ. 'దేవత' సినిమా 25 వారాలు ఆడినట్టు 'వాల్మీకి' సినిమా కూడా 25 వారాలు ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉండాలి అని చెప్పుకొచ్చారు.