గద్దలకొండ గణేష్ అంటే గజగజ వణికిపోవాల... వామ్మో 'వాల్మీకి'(Video)
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్లో వరుణ్ తేజ్ లుక్ మామూలుగా లేదు. అదిరిపోయింది. ఎఫ్ 2లో ఫన్నీ క్యారెక్టర్ చేసిన వరుణ్ తేజ్ ఈ చిత్రంలో విలన్ లుక్‌లో అదరగొడుతున్నాడు. కాగా ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.
రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ చిత్రం జిగర్తాండకు రీమేక్. సెప్టెంబరు 20న విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. గద్దలకొండ గణేష్ అంటే గజగజ వణికిపోవాల అంటూ వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్... ఏంట్రో సతాయిస్తున్నవ్ అంటూ తెలంగాణ యాస అతికినట్లుగా వుంది. చూడండి ట్రైలర్...