శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (12:48 IST)

అఖిల్‌కు నో చెప్పిన జిగేల్‌రాణి

జిగేల్ రాణి పూజా హెగ్డే.. యంగ్ అందగాడు అఖిల్‌కు నో చెప్పిందట. అఖిల్ ఫ్లాఫ్‌ల సంగతి తెలిసి.. ఆయనతో సినిమాలు చేసేందుకు పూజా హెగ్డే నో చెప్పిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ముందుగా అఖిల్‌తో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. త్వరలో షూటింగ్‌లో పాల్గొంటుందనుకున్న సమయంలో సినిమా చేయనని తెగేసి చెప్పేసింది. అలాగే పూజా హెగ్డే డిమాండ్ చేసినంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చేనందుకు చిత్ర యూనిట్ సుముఖంగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది.
 
దీంతో నిర్మాత‌లు మ‌రో హీరోయిన్‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ని టాక్‌. ఆకాశ్ పూరి చిత్రం రొమాంటిక్‌ ఫేమ్ కేతికా శ‌ర్మ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసిందే.