గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (11:20 IST)

చిరు బ‌యోపిక్. ఇంత‌కీ హీరో, ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?

ఇటు టాలీవుడ్ లోను, అటు బాలీవుడ్‌లోను బ‌యోపిక్‌‍ల ట్రెండ్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అందుక‌నే హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు బ‌యోపిక్‌లను తెర‌కెక్కిచేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... మెగాస్టార్ చిరంజీవి బ‌యోపిక్ తీయాల‌ని ప్లాన్ జ‌రుగుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మెగా హీరో వ‌రుణ్ తేజ్ బ‌య‌ట‌పెట్ట‌డం విశేషం.
 
అవును... చిరు బ‌యోపిక్ తెర‌కెక్కించాల‌ని ఓ ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా ద‌ర్శ‌కుడు అంటారా..? టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. ఇటీవ‌ల ఈ విష‌యాన్ని వాల్మీకి షూటింగ్ గ్యాప్‌లో హ‌రీష్ శంక‌ర్.. వ‌రుణ్ తేజ్‌తో చెప్పాడ‌ట‌. చిరంజీవి పాత్ర‌ను రామ చ‌ర‌ణ్ పోషిస్తే బాగుంటుంద‌ని వ‌రుణ్ తేజ్ ఓ ఇంట‌ర్ వ్యూలో చెప్పారు. 
 
ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అభిమానులు చిరు బ‌యోపిక్ ఎంత త్వ‌ర‌గా వ‌స్తే అంత మంచిది అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.
 
సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్ధాయికి ఎదిగిన చిరంజీవి జీవిత చ‌రిత్ర చాలా మందికి స్ఫూర్తిగా ఉంటుంది. కాబ‌ట్టి ఈ క‌థ‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి. చిరు బ‌యోపిక్ అంటే చిరు ఎలా స్పందిస్తారో..? రామ‌చ‌ర‌ణ్ ఎలా స్పందిస్తారో తెలియాల్సివుంది.