శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (11:55 IST)

నకిలీ ఖాతాలో ట్విట్టర్ కొరడా..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలపై సదరు సంస్థ కొరడా ఝళిపించింది. ట్విట్టర్‌లో సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు, నాయకుల ఖాతాలు వుంటాయి. అయితే కొన్ని నకిలీ ఖాతాలు సెలెబ్రిటీలు, రాజకీయ నేతల పేరిట యాక్టివ్‌లో వున్నాయి. ఈ ఖాతాల్లో ఫేక్ ఫోటోలు, వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరుగుతుంటుంది. 
 
ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే దిశగా ఫేక్ అకౌంట్లపై ట్విట్టర్ కొరడా ఝుళిపించింది. ట్విట్టర్‌లో ఒకే పేరిట కలిగిన నకిలీ అకౌంట్లతో వచ్చే ఇబ్బందులను తగ్గించేందుకు.. ఇంకా ఫేక్ వార్తలను కట్టడి చేసే దిశగా పలు అకౌంట్లకు ట్విట్టర్ కళ్లెం వేసింది. ఫేక్ అకౌంట్లకు కళ్లెం వేసింది. కాగా సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్ ద్వారా రోజూ జరుగుతున్న అంశాలేంటో ట్రెండింగ్ ద్వారా నెటిజన్లు తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే.