గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (15:03 IST)

కులం గురించి కౌంటరిచ్చిన లావణ్య త్రిపాఠి..

సినీతార లావణ్య త్రిపాఠి కులం గురించి మాట్లాడిన ఓ వ్యక్తికి కౌంటరిచ్చింది. కానీ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఏమోనని ట్వీట్ తొలగించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అఖిల బ్రాహ్మణ మహాసభకు ముఖ్య అతిథిగా ఓం బిర్లా బ్రాహ్మణ కులానికి అనుకూలంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం వుందన్నారు. ఇంకా పరశురాముడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్యాగం, తపస్సు ప్రాప్తించిన కారణంగా ఎప్పుడూ బ్రాహ్మణులు సమాజంలో మార్గదర్శకత్వం వహించే కీలక భూమికను పోషిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఓ బాధ్యాతమయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్న తరుణంలో లావణ్య త్రిపాఠి ట్విట్టర్ ద్వారా కౌంటరిచ్చింది. 
 
తాను బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తినే. కానీ కొందరు బ్రాహ్మణులకు మాత్రం తాము గొప్ప అనే ఫీలింగ్ ఎందుకుంటుందో అర్థం కావట్లేదు. ''నువ్వు చేసే పనులను అనుసరించే నువ్వు గొప్పవాడివి అవుతావు. కానీ నీ కులం వల్ల కాదు'' అంటూ లావణ్య ట్వీట్ చేశారు. కానీ ఆ ట్వీట్‌ లావణ్య డిలీట్ చేసింది.