శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2019 (16:57 IST)

ట్విట్టర్ సీఈవోకే ఇలాంటి పరిస్థితి ఎదురైందా?

రాజకీయాలు, సినిమా, క్రీడా రంగాల్లో ప్రముఖులైన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో ఒకటైన ట్విట్టర్‌ను తెగవాడుకుంటున్నారు. అయితే కొందరు ప్రముఖుల అకౌంట్లు హ్యాక్ అవుతూ వస్తాయి. కొందరు హ్యాకర్లు సెలెబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవో జాక్ ట్విట్టర్ అకౌంట్  కూడా హ్యాక్ అయ్యింది. ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. హ్యాక్ చేయబడిన ట్విట్టర్ సీఈవో అకౌంట్ నుంచి డేటా చోరికి గురైంది. ఇంకా పది నిమిషాల పాటు వున్న ట్వీట్లు.. ఆపై డిలీట్ అయ్యాయి. దీనిపై స్పందించిన ట్విట్టర్ సీఈవో.. తన అకౌంట్ ప్రస్తుతం భద్రంగా వుందన్నారు. హ్యాకర్ల నుంచి తన ట్విట్టర్ అకౌంట్‌కు భద్రత కల్పించినట్లు చెప్పారు. 
 
ఇకపోతే.. హ్యాకర్లు ముందు ట్విట్టర్ సీఈవో ఫోన్ నెంబర్‌ను కనుగొన్నారు. ఆపై ట్విట్టర్ అకౌంట్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని తెలిసింది. ట్విట్టర్ సీఈవోకే హ్యాకర్ల బెడద తప్పలేదని.. అందుచేత నెటిజన్లు తమ అకౌంట్లను ప్రతీసారీ పరిశోధించుకోవాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు.