2G హ్యాండ్సెట్ మార్కెట్‌పై జియో కన్ను, 699 ఆఫర్‌తో జియోఫోన్ జోరు
భారతీయ టెలికాం రంగంలో 4G టెక్నాలజీని ప్రవేశపెట్టి సంచలనాలకు మారు పేరుగా మారిన రిలయన్స్ జియో ఇప్పుడు 2G మార్కెట్ పై కన్నేసింది. ప్రస్తుతం భారతదేశంలోని దాదాపు 35 కోట్లకు పైగా ప్రజలు నేటికి 2జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు మరియు వారికి స్మార్ట్‌ఫోన్ సేవలు అందుబాటులో లేవు. తెలంగాణాలో ఇప్పటికీ 2 కోట్ల మంది ప్రజలు 2G వాడుతున్నారు.
ఈ 2జీ వినియోగదారులు ముందు ప్రస్తుతం అతి సంక్లిష్టమైన స్థితి ఉంది. డాటా సర్వీసులపై ఆశలు వదిలేసుకోవడం లేదా నాణ్యతలేని 2జీ డాటా సేవల కోసం అత్యంత ఎక్కువ ధరను చెల్లించడం మాత్రమే వారి ముందున్న అవకాశం. ఇంతేకాకుండా వారు ఉచిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు, ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో జియో మరో భారీ అడుగు వేస్తూ భారతీయులందరినీ డిజిటల్ విప్లవంలో భాగం చేసుకునేందుకు ముందుకు సాగుతోంది. ప్రత్యేకమైన మరియు ఒకేసారి మాత్రమే లభ్యమయ్యే ఆఫర్‌ను `జియో ఫోన్ దీపావళి 2019 ఆఫర్` పేరుతో జియో నేడు ప్రకటించింది. దసరా మరియు దీపావళి పండుగ సమయంలో, జియో ఫోన్ ప్రస్తుత ధర రూ.1500 కాకుండా ప్రత్యేక ధర కింద కేవలం రూ. 699కే జియో ఫోన్ అందుబాటులో ఉంచుతోంది. అంటే రూ.800 ఒకేసారి పొదుపు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకోవడం వంటి ప్రత్యేకమైన షరతులు ఏవీ కూడా విధించకపోవడం దీనియొక్క మరో ప్రత్యేకత.
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 2జీ ఫీచర్ ఫోన్ల కంటే కూడా ఈ ధర ఎంతో తక్కువ కావడం విశేషం. తద్వారా, ఫీచర్ ఫోన్ వినియోగదారులు శక్తివంతమైన 4జీ సేవలను పొందేందుకు ఉన్న చివరి అడ్డంకి సైతం ఈ రూపంలో దూరం చేయడం సాధ్యమైంది. రూ.700కు సంబంధించి, జియో ఫోన్ వినియోగదారులు ఆ మొత్తంతో జియో ఫోన్ కొనుగోలు చేసి 2జీ నుంచి 4జీ డాటా ప్రపంచంలోకి మారిపోవచ్చు. ఇదే సమయంలో, జియో సైతం తనవంతు పెట్టుబడిని పెడుతున్న విషయం స్పష్టమవుతోంది. తద్వారా, భారతదేశంలోని అర్హత కలిగిన వర్గాలన్నింటినీ ఇంటర్నెట్ ఎకానమీలో భాగస్వామ్యం అయ్యేందుకు జియో పెట్టుబడి పెట్టడంతో పాటుగా అంకితభావంతో కృషి చేస్తోంది.
జియో ఫోన్ వినియోగదారుల విషయానికి వస్తే, దీపావళి 2019 ఆఫర్ వినియోగించుకోవాలని భావిస్తే, రూ.700 విలువైన డాటా ప్రయోజనాలను జియో వారికి అందిస్తోంది. ఆ వినియోగదారుడు చేసుకున్న మొదటి ఏడు రీచార్జ్‌లకు రూ.99 విలువైన డాటాను జియో అధనంగా జతచేయనుంది. జియోఫోన్ వినియోగదారులకు అధనంగా అందే ఈ రూ.700 డాటాతో జియో వినియోగదారులు ఎంటర్‌టైన్‌మెంట్, పేమెంట్స్, ఈకామర్స్, విద్య, శిక్షణ, రైల్లు మరియు బస్ బుకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు మరియు మరెన్నో అంశాలకు సంబంధించిన మునుపెన్నడూ లేని అనుభూతులను సొంతం చేసుకోవచ్చు.