1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Indel Remit Receives RBI Approval for Trade Remittance Service

వాణిజ్య చెల్లింపుల సేవల కోసం ఆర్‌బిఐ ఆమోదం అందుకున్న ఇండెల్ రెమిట్‌

Cash
ముంబై: ఇండెల్ మనీ లిమిటెడ్ యొక్క విదేశీ మారక విభాగమైన ఇండెల్ రెమిట్, వాణిజ్య చెల్లింపుల సేవలను అందించడానికి ఆర్‌బిఐ ఆమోదం పొందింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇండెల్ రెమిట్, ప్రస్తుతం విదేశీ మారక వ్యాపారం కోసం ఆర్‌బిఐ నుండి అధీకృత డీలర్ కేటగిరీ-II లైసెన్స్‌ను కలిగి ఉంది. ఈ కొత్త లైసెన్స్‌తో బహుమతులు, విరాళాలు, అలాగే ఒక్కో లావాదేవీకి రూ. 25 లక్షల వరకు విదేశీ వాణిజ్య లావాదేవీలు మినహా, చట్టం ప్రకారం అనుమతించబడిన ఏవైనా వాణిజ్యేతర కరెంట్ ఖాతా లావాదేవీలను చేపట్టడానికి ఇండెల్ రెమిట్‌కు ఇప్పుడు అధికారం లభించింది. వ్యాపారులు ఇప్పుడు ఇండెల్ మనీ విభాగం ద్వారా ఒక్కో లావాదేవీకి రూ. 25 లక్షల వరకు వేగవంతమైన, సురక్షితమైన, నమ్మకమైన చెల్లింపులు చేయవచ్చు.
 
ఇండెల్ మనీ ఈడీ- సీఈఓ ఉమేష్ మోహనన్ మాట్లాడుతూ, భారతీయ వ్యాపార సంస్థలు ప్రపంచ మార్కెట్లతో మమేకమయ్యే విధానం వేగంగా మారుతోంది, నిరాటంకమైన సరిహద్దు చెల్లింపుల మౌలిక సదుపాయాలు అంతకంతకూ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. సమగ్రమైన, విశ్వసనీయమైన విదేశీ మారక వేదికను నిర్మించే మా ప్రయాణంలో ఈ ఆమోదం ఒక ముఖ్యమైన మైలురాయి.
 
నియంత్రణ సమ్మతి, కస్టమర్ సేవలో అత్యున్నత ప్రమాణాలను అనుసరిస్తూనే, అంతర్జాతీయ లావాదేవీలను మరింత సులభతరం చేయటం, సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై మాదృష్టి కేంద్రీకృతమై ఉంది. భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో దీనిని ఒక ముఖ్యమైన అడుగుగా మేము భావిస్తున్నాము అని అన్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఆగస్టు 25న Evo, Ace 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్న బోల్ట్