1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. 700 Rupees Note: RBI going to introducing a new 700 rupees note

రూ.700ల కరెన్సీ నోటును ప్రవేశపెట్టనున్న ఆర్బీఐ? ప్లాస్టిక్ కరెన్సీ కూడా?

RBI
RBI
రూ.100, రూ.200, రూ.500 రూపాయల నోట్ల మాదిరిగానే రూ.700ల నోటు వైరల్ అవుతోంది. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలో 100, 200, 500 రూపాయల నోట్ల తరహాలోనే గాంధీ చిత్రం ఉంది. నోటుకు వెనుకభాగం, కర్ణాటక మైసూరు సమీపంలో హోసా కన్నంపాటిలో ఉన్న శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయంలో చిత్రం ఉంది. 
 
విజేంద్ర పటేల్ అనే వ్యక్తి తన ఎక్స్ పేజీలో ఈ చిత్రాన్ని పంచుకున్నారు. ఇంకా 100, 200, 500 రూపాయల నోట్లను కొనసాగిస్తూనే రిజర్వ్ బ్యాంకు 700 రూపాయల నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు సామాజిక వెబ్‌సైట్లలో ఒక వార్త వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆర్థిక స్థితిని సమతుల్యం చేయడం ద్వారా ఈ చర్యను కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. 
 
అలాగే ప్లాస్టిక్ రూపాయల నోట్లను పరిచయం చేసే పథకాన్ని కూడా ఆర్బీఐ అమలు చేసే దిశగా రంగం సిద్ధం చేస్తుంది. రూపాయలు నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చునే తగ్గించే దిశగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు ప్లాస్టిక్ రూపాయి నోట్లను పరిచయం చేయాలనుకుంటోంది. ఈ నోట్లు కాగితపు నొట్లను కంటే మూడు రెట్లు ఎక్కువ కాలం పాటు పాడవకుండా కొనసాగుతాయి.
 
ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి అనేక దేశాల్లో ప్లాస్టిక్ నోట్లు ఆచరణలో వున్నాయి. భారత్‌లో కూడా ఈ ఇలాంటి ప్లాస్టిక్ నోట్లను పరిచయం చేసే దిశగా ఆర్బీఐ సన్నాహాలు చేస్తున్న తరుణంలో రూ.700 రూపాయల నోట్లు రానున్నాయనే వార్త వైరల్ అవుతోంది. అయితే 700 రూపాయిల నోటు విడుదలవుతుందని సమాచారం పూర్తిగా అసత్యమని తెలుస్తోంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మరో మూడేళ్ల తర్వాత ఒక్క ఉద్యోగి ఉండరు... : గూగుల్ మాజీ బిజినెస్ చీఫ్