శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (10:45 IST)

Infinix GT 10 Pro పేరుతో 24 జీబీ ర్యామ్‌తో తొలి స్మార్ట్‌ఫోన్‌

Infinix GT 10 Pro
Infinix GT 10 Pro
స్మార్ట్‌ఫోన్‌లలో 8 GB RAM అందించే ట్రెండ్ పాతది. ప్రస్తుతం 16 జీబీ ర్యామ్‌తో కూడిన మోడల్స్ త్వరలో ఈ లైనప్‌లో చేరనున్నాయని తెలుస్తోంది. ఇటీవల, OnePlus గ్రూప్ (Oppo, OnePlus, Realme) 24GB RAM‌తో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
 
అయితే ఈ కంపెనీల కంటే ముందే రెడ్ మ్యాజిక్ 8ఎస్ ప్రో స్మార్ట్‌ఫోన్ 24 జీబీ ర్యామ్‌తో తొలి స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందింది. Infinix గరిష్టంగా 26 GB ర్యామ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిసింది.
 
Infinix GT 10 Pro పేరుతో వచ్చే ఈ మోడల్ భారత మార్కెట్‌లో 26 జీబీ ర్యామ్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా భారత్‌లో విడుదల చేసి ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 
 
ఫీచర్ల విషయానికొస్తే, Infinix GT 10 Pro మోడల్ MediaTek Dimension 8050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
స్మార్ట్‌ఫోన్ 7000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని, 260W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని చెప్పబడింది. 
 
అదే స్మార్ట్‌ఫోన్ 160W ఛార్జింగ్ వేరియంట్‌ను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఫోటోలు కోసం 100MP ప్రైమరీ కెమెరా, రెండు 8MP లెన్స్‌లను అందించవచ్చు. దీని ధర రూ. 34.990లుగా నిర్ణయించారు. ఇది ఆగస్టు 1న భారత మార్కెట్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.