1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. iphoneApple iPhone 13 gets huge price cut after iPhone 15 series

ఐఫోన్ 15 సిరీస్ రాగానే భారీగా తగ్గిన ఆ ఫోన్ ధరలు

apple iPhone
భారతీయ మొబైల్ మార్కెట్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ వచ్చింది. ఈ ఫోన్లు అందుబాటులోకి రాగానే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 సిరీస్ ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రతి యేడాదిలో యాపిల్ లెట్స్ట్ మోడళ్లకు అనుగుణంగా పాత స్మార్ట్ ఫోన్ల మోడళ్ల ధరలను తగ్గిస్తుంది. 
 
ఐఫోన్ 14 ప్రో మోడ్‌లతో పాటు ఐఫోన్ 12, ఐఫోన్ 13 మినీల విక్రయాన్ని కూడా కంపెనీ నిలిపివేసింది. రెండోది డిస్ ప్లే నాచ్‌తో ఆపిల్ లాంచ్ చేసిన చివరి ‘కాంపాక్ట్’ ఐఫోన్ మోడల్‌గా చెప్పవచ్చు. భారత్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13 ధరలు ప్రస్తుతం ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్నాయి.
 
భారత మార్కెట్లో ఐఫోన్ 14 బేస్ 128జీవీ స్టోరేజ్ మోడల్ ధర ఇప్పుడు రూ.69,900గా ఉంది. అసలు ధర రూ.79,900 నుంచి తగ్గింది. దేశంలో లాంచ్ చేసిన ఐఫోన్ 14 ప్లస్ ఇప్పుడు ఆపిల్ వెబ్‌సైట్ ద్వారా రూ.89,900 నుంచి తగ్గి రూ.79,900కి అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్ (ప్రొడక్టు) రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. 
 
తర్వాతి కథనం
ఏడాదికి 8.45% నుండి మొదలయ్యే వడ్డీ రేట్లతో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పండుగ గృహ రుణాలు