ఎల్జీ నుంచి రోలింగ్ ల్యాప్ టాప్.. స్క్రీన్‌ను ఏకంగా చుట్టేసేలా..?
Laptop
ఎల్జీ త్వరలోనే 17-అంగుళాల రోలింగ్ డిస్‌ప్లేతో ల్యాప్‌టాప్ తీసుకురానుందట. ఈ మేరకు రూట్ మై గెలాక్సీ పేరుతో రోలింగ్ ల్యాప్‌టాప్ డిజైన్‌కు సంబంధించిన హక్కులను ఇటీవలే పొందినట్లు టెక్ వర్గాలు తెలిపాయి. రోలింగ్ ల్యాప్‌టాప్ డిస్‌ప్లేని 13.3 అంగుళాల నుంచి 17 అంగుళాల సైజు వరకు ఉపయోగించుకోవచ్చు.
అలానే ల్యాప్‌టాప్ కీబోర్డు కూడా మడతపెట్టేయొచ్చు. ఇప్పటికే ఎల్‌జీ వింగ్, జీ8 ఎక్స్ థింక్యూ పేరుతో డ్యూయల్ స్క్రీన్ మొబైల్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త్వరలోనే దీనిపై ఎల్‌జీ నుంచి రోలింగ్ ల్యాప్‌టాప్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
