శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (23:08 IST)

ప్రతిష్టాత్మక ఈ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ‘ఈ-సఫాయి’ను ప్రకటించిన ఆర్‌ఎల్‌జీ ఇండియా

సమగ్రమైన రివర్శ్‌ లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ సేవల ప్రదాతగా అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉండటంతో పాటుగా మునిచ్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన రివర్శ్‌ లాజిస్టిక్స్‌ గ్రూప్‌ (ఆర్‌ఎల్‌జీ)లో భాగమైన ఆర్‌ఎల్‌జీ ఇండియా మరియు ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కో ఆపరేషన్‌ రంగంలో సేవలను అందిస్తున్న జర్మనీ కేంద్రంగా కలిగిన డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ జిజ్‌ జీఎంబీహెచ్‌లో భాగమైన జీఐజెడ్‌ ఇండియాలు ఉమ్మడి ఇ-వ్యర్థ నిర్వహణ కార్యక్రమం ఈ-సఫాయిను నవంబర్‌ 10, 2020వ తేదీన ప్రారంభించాయి.
 
ఈ మూడు సంవత్సరాల అభివృద్ధి పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్ట్‌ను ‘సెట్టింగ్‌ అప్‌ ఇన్నోవేటివ్‌ వాల్యూ చైన్‌ ఫర్‌ ఈ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’గా కూడా పిలుస్తున్నారు. దీనికి జర్మన్‌ ఫెడరల్‌ మినిస్ట్రీ ఫర్‌ ఎకనమిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీఎంజెడ్‌) మద్దతునందిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ ప్రధాన లక్ష్యం, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు (ఆర్‌డబ్ల్యుఏలు), పాఠశాలలు, రిటైలర్లు, భారీ వినియోగదారులు సహా పలువురు వాటాదారులకు సురక్షితంగా మరియు స్థిరమైన విధానంలో ఈ-వ్యర్థాలను నిర్వహించడం గురించి అవగాహన కల్పించడం.
 
అదనంగా, ఈ కార్యక్రమం, అసంఘటిత రంగంలో సంఘటిత ఈ-వ్యర్ధ నిర్వహణ వాల్యూ చైన్స్‌ తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించింది. వరుసగా పలు ఆన్‌లైన్‌ మరియు ఆన్‌గ్రౌండ్‌ క్యాంపెయిన్స్‌ను ఢిల్లీ మరియు హైదరాబాద్‌లలో రాబోయే మూడేళ్లలో నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఈ–వ్యర్ధాలను సాధారణ రీసైక్లింగ్‌ కోసం మార్గాంతరీకరణ చేయడంతో పాటుగా అసంఘటిత రంగ సామర్థ్యం వృద్ధి చేయడం ద్వారా ఈ–వ్యర్థాలను నాశనం చేసే మౌలిక వసతులను బలోపేతం చేయడం చేయనున్నారు. చివరగా,  ఈ కార్యక్రమం విధాన సలహాలను దేశంలో ఈ–వ్యర్ధాల నిర్వహణ పర్యావరణ వ్యవస్థ కోసం అందించనుందని అంచనా.
 
ఈ ప్రాజెక్ట్‌ కాలంలో, ఎంపిక చేసిన నగరాలలో, ఆర్‌ఎల్‌జీ ఇండియా మరియు జీఐజెడ్‌ ఇండియాలు రెండు రీ సైక్లింగ్‌ ప్లాంట్‌లను, 90 ఈ-వేస్ట్‌ బిన్స్‌తో పాటుగా నాలుగు కలెక్షన్‌ కేంద్రాలను (ఢిల్లీ, హైదరాబాద్‌లలో రెండేసి చొప్పున) ఏర్పాటుచేయనున్నాయి. ఈ కంపెనీలు కలెక్షన్‌, డిస్‌మాంట్లింగ్‌ మరియు రీసైక్లింగ్‌ ప్రక్రియలో 1000కు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించనున్నాయని అంచనా. ఈ-సఫాయీ ద్వారా పలు ఆన్‌లైన్‌, ఆన్‌ గ్రౌండ్‌ కార్యక్రమాలు జరిపి 0.3 మిలియన్‌ల మంది ప్రజలను చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
 
వర్ట్యువల్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీమతి రాధికా కాలియా, మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఆర్‌ఎల్‌జీ ఇండియా మాట్లాడుతూ ‘‘స్ధిరమైన మరియు నిరంతర ప్రయత్నాలలో మరో ముందడుగు- సఫాయి. దీనిద్వారా సమర్థవంతమైన ఈ-వ్యర్థ నిర్వహణ పర్యావరణ వ్యవస్థను సృష్టించనున్నారు.తద్వారా అంతర్జాతీయంగా ఎదురవుతున్న  అతిపెద్ద సవాలుకు తగిన పరిష్కారమూ చూపనున్నారు.ఈ కార్యక్రమాన్ని సమ్మిళిత విధానంలో ప్రారంభించారు. ఇది సమతుల్యమైన విధానంలో ఉత్పత్తిదారులు, రీసైకిలర్లు, డిస్‌మాంట్లర్లు, కన్స్యూమర్లు, రిటైలర్లతో పనిచేస్తుంది. ప్రభావవంతమైన మరియు సురక్షితమైన ఈ-వ్యర్ధ రీసైక్లింగ్‌కు మద్దతునందిచడంతో పాటుగా అసంఘటిత రంగంతో కూడా చురుగ్గా అనుసంధానితమవుతుంది. మరీ ముఖ్యంగా, సామర్థ్య నిర్వహణ ద్వారా అధికారిక ఈ– వ్యర్ధాల  విలువ గొలుసులో గ్రహించడం/లాంఛనప్రాయంగా మార్చడం చేయనున్నాం’’ అని అన్నారు.
 
డాక్టర్‌ అశీష్‌ చతుర్వేది, డైరెక్టర్‌–క్లైమెట్‌ ఛేంజ్‌ అండ్‌ సర్క్యులర్‌ ఎకనమీ, జీఐజెడ్‌ ఇండియా మాట్లాడుతూ భారతదేశంలో ఈ–వ్యర్ధ నిర్వహణ తీరును ఈ విధంగా మారుస్తుందనే అంశమై తన అంచనాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఈ–వ్యర్థాల నిర్వహణ రంగానికి గుర్తించనటువంటి భారీ సామర్థ్యం ఉంది. ఇది ద్వితీయ రిసోర్స్‌ రికవరీగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ–వ్యర్ధాలలో అత్యంత కీలకమైన మెటీరియల్స్‌ ఉన్నాయి. వీటిని సరైన రీతిలో తీసుకోగలిగితే భారతదేశంలో నూతన ఉత్పత్తుల తయారీకి వినియోగించవచ్చు.ఇది గణనీయంగా దిగుమతులపై ఆధారపడటం తగ్గిస్తుంది. అంతేకాదు, సంఘటిత రీసైక్లింగ్‌ రంగానికి పెద్దమొత్తంలో ఉపాధి అవకాశాలను కల్పించే సామర్థ్యం ఉంది. ఇది అసంఘటిత రంగాన్ని సంఘటితంగా మార్చేందుకు సైతం తోడ్పడుతుంది. వాటాదారులందరి మద్దతుతో, ఈ-సఫాయి తమ లక్ష్యాలను చేరుకోవడంతో పాటుగా భారతదేశంలో ఈ-వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడంలో తోడ్పడనుంది’’ అని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్‌ సందీప్‌ ఛటర్జీ,డైరెక్టర్‌ అండ్‌ సైంటిస్ట్‌ ఎఫ్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (మీటీ) ఇప్పుడు పూర్తిగా ఈ-సఫాయి కార్యక్రమానికి మద్దతునందిస్తుంది. మంత్రిత్వ శాఖ ఈ వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన పలు కార్యక్రమాలను గురించి వెల్లడించారు. డాక్టర్‌ ఛటర్జీ మాట్లాడుతూ ‘‘ మీటీ విజయవంతంగా భారతదేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను 2015-2020 నడుమ నిర్వహించింది. భారతదేశ వ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దీనిని చేయడంతో పాటుగా ఈ–వ్యర్ధాల రీసైక్లింగ్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించింది..’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ మీటీ ఇప్పుడు అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన రీసైక్లింగ్‌ ప్రక్రియను గురించి వెల్లడించడంతో పాటుగా రీసైక్లిలర్ల కోసం అందుబాటు ధరలలోని మెషీన్లు మరియు సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలకా్ట్రనిక్స్‌ టెక్నాలజీ (సీ-మెట్‌) హైదరాబాద్‌ వద్ద ఓ కేంద్రాన్ని ప్రారంభించామని, తద్వారా ఈ విషయాంశాలను అంకుర సంస్థలకు అందించామని వెల్లడించారు.
 
డాక్టర్‌ ధర్మేంద్ర కుమార్‌ గుప్తా, సైంటిస్ట్‌ ఎఫ్‌, సీనియర్‌ డైరెక్టర్‌, హజార్డస్‌ సబ్‌స్టాన్సెస్‌ మేనేజ్‌మెంట్‌ (హెచ్‌ఎస్‌ఎం) డివిజన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్ట్స్‌ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ ఈ కార్యక్రమానికి కీలకోపన్యాసం చేశారు. అశాస్త్రీయంగా ఈ–వ్యర్ధాలను నాశనం చేయడం, భారతదేశంలో వాటిని నిర్వహించడం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య దుష్ఫరిణామాలను గురించి వెల్లడించారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు,కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డులు (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రమణ మండలిలు, పౌర సమాజ సంస్ధలు, ప్రొడ్యూసర్‌ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్లు (పీఆర్‌ఓ) మరియు అర్బన్‌ లోకల్‌బాడీస్‌ (యుఎల్‌బీలు) ఏకతాటిపై రావడం ద్వారా విజయవంతంగా ఈ–వ్యర్ధాల నిర్వహణ నిబంధనలు తీసుకురావడం మరియు అవగాహన మెరుగుపరచడం సాధ్యమవుతుంది.