సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 నవంబరు 2020 (18:48 IST)

భారతదేశపు మొదటి ఐదు ఫేవరెట్ దీపావళి హాలీడే స్పాట్స్‌లో విశాఖపట్నం

అత్యంత ఆశ్చర్యకరమైన సంవత్సరంగా 2020 ఎప్పటికీ నిలిచిపోతుంది. మాస్కులు, గ్లోవ్స్‌ వంటివి అతి సాధారణంగా మారాయి. డబ్ల్యుఎఫ్‌హెచ్‌ జీవనశైలి మరియు వర్ట్యువల్‌ సమూహాలు అనేవి సాధారణంలో భాగంగా మారాయి. అయితే, భారతదేశంలో నెమ్మదిగా అన్‌లాక్‌ ప్రక్రియ జరుగుతుండటంతో, మరింత మంది ప్రజలు ఇప్పుడు బయటకు రావడంతో పాటుగా దేశీయంగా అన్వేషించని అనేక ప్రాంతాలను అన్వేషించడమూ మొదలైంది.

అదే సమయంలో వ్యక్తిగత భద్రత మరియు పరిశుభ్రతకు సైతం భరోసా కల్పించడం ఆవశ్యకమైంది. ప్రపంచంలో సుప్రసిద్ధ హాస్పిటాలిటీ చైన్‌, ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ వెల్లడించే దానిప్రకారం, నెలలుగా ఇళ్లలో ఉండిపోవడమనే అంశానికి ముగింపు పలుకుతున్నారు. ఈ దీపావళికి, భారతీయులు ఇంటర్‌స్టేట్‌ రోడ్‌ ట్రిప్స్‌ మరియు బీచ్‌ కేంద్రాలను చేరుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
 
ఓయో యొక్కదీపావళి బుకింగ్‌ ట్రెండ్స్‌ ప్రకారం, జైపూర్‌, కొచి, గోవా, విశాఖపట్నం మరియు వారణాసిలు ఈ దీపావళి వేళ భారతీయులకు అత్యంత ఇష్టమైన విశ్రాంత కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. ఈ డేటా మరింతగా వెల్లడించే దాని ప్రకారం, ఉత్తర భారతదేశంలో అధిక శాతం మందికి అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక కేంద్రంగా జైపూర్‌ నిలుస్తుంది. లక్నో మరియు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ నుంచి అధికశాతం మంది ప్రజలు ఇక్కడకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. దక్షిణ భారతదేశంలో చెన్నై మరియు బెంగళూరు ప్రజలు రోడ్డు మార్గంలో కేరళలోని కొచి చేరుకోవాలని చూస్తున్నారు. భారతదేశపు బీచ్‌ రాజధాని గోవా మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల పర్యాటకులనూ ఆకట్టుకుంటుంది. అధికశాతం బుకింగ్స్‌ పూనె నుంచి వస్తే, ఆ తర్వాత బెంగళూరు మరియు హైదరాబాద్‌ ఉన్నాయి.
 
ఈ నేపధ్యంలో హర్షిత్‌ వ్యాస్‌, ఎస్‌వీపీ అండ్‌ సీఓఓ- ఫ్రాంచైజీ బిజినెస్‌, ఓయో ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా మాట్లాడుతూ, ‘‘పండుగ సీజన్‌తో పాటుగా పలు దశలలో జరుగుతున్న అన్‌లాక్స్‌ కారణంగా లీజర్‌ ట్రావెల్‌కు సెప్టెంబర్‌ 2020 నుంచి గణనీయంగా ఆదరణ కలుగుతుంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే పర్యాటకులను ఆహ్వానించడానికి తమ సరిహద్దులను తెరిచాయి. ఓయో మరియు మొత్తం ఆతిధ్య రంగ పరిశ్రమ, ఇప్పుడు సురక్షిత అనుభవాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి పర్యాటకుల నడుమ ఆత్మవిశ్వాసం మెరుగుపరుస్తున్నాయి.
 
మా దీపావళి బుకింగ్‌ ట్రెండ్స్‌ అనుసరించి, భౌతిక దూరం అనేది జీవనమార్గమైంది మరియు ప్రజలు సురక్షిత ప్రయాణ అవకాశాలను ఎంచుకుంటున్నారు. రోడ్డు ప్రయాణాలు ఇక్కడే ఉండనున్నాయి. అందువల్ల, దీపావళి సమయంలో ఇంటర్‌ స్టేట్‌ ట్రావెల్‌ అనేది పెరిగింది మరియు రాబోతున్న హాలీడే సీజన్‌లో కూడా ఇది వృద్ధి చెందనుంది. రాబోయే నెలలో లీజర్‌ డెస్టినేషన్స్‌కు ఆదరణ మరింతగా పెరగనుంది. అధిక సంఖ్యలో పర్యాటకులు యాత్రలు చేయాలనుకోవడం దీనికి ఓ కారణం. మా ఎస్సెట్‌ భాగస్వాములకు మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మరోమారు మా అతిథులకు పూర్తి సురక్షిత వాతావరణంలో ఆహ్వానించేందుకు తగిన భరోసా అందించడంలో తోడ్పడిన ఉద్యోగులకు కూడా ధన్యవాదములు తెలుపుతున్నాము’’ అని అన్నారు.
 
లీజర్‌ ట్రావెల్‌కు తిరిగి రావడం పట్ల తన ఆలోచనలను గురించి యతీష్‌ జైన్‌, హెడ్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ రెవిన్యూ అండ్‌ మార్కెటింగ్‌, సౌత్‌ ఆసియా- ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ మాట్లాడుతూ, ‘‘ఈ సెలవు సీజన్‌లో భారతదేశవ్యాప్తంగా యాత్రికులకు పెరుగుతున్న ఆశావాదం పర్యాటక మరియు ఆతిథ్య పర్యావరణ వ్యవస్థకు స్వాగతించే మార్పు. మా వినియోగదారుల యూజ్‌ కేసుల ప్రకారం, 57%మంది స్పందనదారులు విశ్రాంత ప్రయాణాలను చేయాలనుకుంటున్నారు. దాదాపు 61 % మంది స్పందనదారులు వెల్లడించే దాని ప్రకారం, రాబోయే సెలవుల కోసం ఇప్పటికే వారు సిద్ధమయ్యారు.
 
రాబోయే కొద్ది నెలల్లో స్ధిరంగా పెరుగుతున్న ప్రయాణాలకు ఇది సూచికగా నిలుస్తుంది. అయితే, ఈ క్రమంలో 67% మంది ఈ యాత్రికులు సురక్షిత వసతులను కోరుకుంటున్నారు. భద్రత అనేది వినియోగదారుల అత్యున్నత ప్రాధాన్యతగా మారిందనే అంశాన్ని అర్థం చేసుకుని ఓయో వద్ద మేము స్ధిరంగా భద్రత మరియు పరిశుభ్రతా ప్రక్రియలను మా కాంటాక్ట్‌లెస్‌ చెక్‌ ఇన్స్‌ మరియు శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌ కార్యక్రమాలతో చేస్తున్నాం.
 
మా దీపావళి బుకింగ్‌ ధోరణుల ప్రకారం దాదాపు కోవిడ్‌ ముందునాటి పరిస్థితులతో దాదాపు 100% బుకింగ్స్‌ జరుగుతున్నాయి మరియు ట్రాఫిక్‌ 50%కు పైగానే జరుగుతుంది. అధిక శాతం మంది యాత్రికులు స్థానికంగా ఉన్నప్పటికీ ఎవరికీ పెద్దగా తెలియని ప్రదేశాలను అన్వేషించాలనుకుంటున్నారు. ఇది దేశీయ పర్యాటకాన్ని మరింతగా పెంచుతుంది. ఈ ధోరణులకు మేము మద్దతునందించడంతో పాటుగా 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో మా ఉనికి చాటుతున్నాం. మరింత ముందుకు వెళ్తే, 2021 సంవత్సరపు రెండవ అర్ధభాగంలో సైతం ప్రస్తుత ధోరణులు కొనసాగనున్నాయి’’ అని అన్నారు.
 
భారతదేశ వ్యాప్తంగా మా ట్రావెల్‌ ట్రెండ్స్‌ వెల్లడించే దాని ప్రకారం ఏప్రిల్‌ 2020 మరియు సెప్టెంబర్‌ 2020 నడుమ బుకింగ్స్‌ పరంగా వ్యాపార కేంద్రాలైనటువంటి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతాలలో అధికంగా జరుగుతున్నాయి. మరోవైపు విశ్రాంత నగరాలలో, ఓయో బుకింగ్‌ డాటా వెల్లడించే దాని ప్రకారం, సిమ్లా, మనాలీ, మున్నార్‌, ఊటీ, గ్యాంగ్‌టక్‌ లాంటి ప్రాంతాలలో అత్యధిక డిమాండ్‌ లేదు. కోవిడ్‌-19 ముందు నాటి పరిస్థితులతో పోల్చినప్పుడు ఇది తెలుస్తుంది. అయితే సెప్టెంబర్‌ నుంచి ఇక్కడ బుకింగ్స్‌ నెమ్మదిగా పెరుగుతున్నాయి. సిమ్లాలో, ఓయో పరిశీలించిన దాని ప్రకారం నెలవారీ 280% వృద్ధి సెప్టెంబర్‌ 2020లో కనిపించింది. అదనంగా, ఓయో యొక్క ఇటీవలి వినియోగదారుల అధ్యయనంలో, దేశవ్యాప్తంగా విశ్రాంత పర్యాటకంకు డిమాండ్‌ పెరిగింది. 80% మంది వినియోగదారులు శానిటైడ్జ్‌ వసతులు కోరుకుంటున్నారు. అదే సమయంలో 46% మంది వినియోగదారులు తమ తరువాత ప్రయాణాల ప్రణాళికలో నియంత్రిత సమాచారం కావాలనుకుంటున్నారు.
 
యాత్రికులకు సురక్షిత మరియు ఆహ్లాదకరమైన అనుభవాలను పొందడంలో భాగంగా, ఓయో ఇటీవలనే రెండు కార్యక్రమాలను సోనూసూద్‌తో ప్రారంభించింది. ఓయో ఎస్సెట్‌ యజమాని మరియు బ్రాండ్‌ అంబాసిడర్‌ సోనూసూద్‌. శానిటైజ్డ్‌ బిఫోర్‌ యువర్‌ ఐస్‌ అనేది ఆన్‌ రిక్వెస్ట్‌ కార్యక్రమం. దీని ద్వారా ఓయో అతిథులు హోటల్‌ యొక్క సిబ్బందిని అత్యధిక స్పర్శ ప్రాంగణాలను శానిటైజ్‌ చేయాల్సిందిగా కోరవచ్చు. ఇక రెండవ కార్యక్రమం- కాంటాక్ట్‌లెస్‌ చెక్‌ ఇన్‌. ఇది అతిథులకు వేగవంతమైన మరియు సురక్షిత డిజిటల్‌ చెక్‌ ఇన్‌ అనుభవాన్ని, ఎక్కడ, ఎప్పుడైనా సరే అందిస్తుంది. దీనివల్ల హోటల్‌కు వచ్చిన వెంటనే భౌతికంగా స్పృశించడం తగ్గుతుంది.