1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Reliance Jio launches Rs 444 plan with 2GBday data: Check plan validity and other details

వర్క్ ఫ్రమ్ హోం సిబ్బంది కోసం జియో ప్రత్యేక ప్లాన్

Reliance Jio
దేశంలో అగ్రగామిగా ఉన్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజా మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం చేసే సిబ్బందికి ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ ప్లాన్ ధర రూ.444. కాలపరిమితి 56 రోజులు. ఇతర టెలికాం కంపెనీలు అందిస్తున్న ప్లాన్లతో పోలిస్తే ఇది చాలా మంచిదని అని జియో చెబుతోంది. 
 
ఈ ప్లాన్ వివరాలను పరిశీలిస్త, ప్లాన్ విలువ 444 రూపాయలు. మొత్తం కాలపరిమితి 56 రోజులు. ప్రతి రోజూ 2 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. మొత్తం 56 రోజులకుగాను 112 జీబీని వినియోగదారులు వినియోగించవచ్చు. 
 
ఈ డేటా అయిపోయిన తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగదారులు వాడుకోవచ్చు. పైగా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, అన్ని జియో యాప్‌లను ఉచితంగా వినియోగించవచ్చు. అందుకే ఈ ప్లాన్ వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ముందు వరుస కరోనా యోధులన్నారు.. సైలెంట్‌గా తొలగించారు..