గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (17:22 IST)

పొగాకు రైతులపై తీవ్రప్రభావం చూపే కోట్పా(COTPA) సవరణ బిల్లును ఉపసంహరించుకోండి: ప్రధానికి విన్నపం

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్నాటక, గుజరాత్‌ తదితర రాష్ట్రాలలో వాణిజ్య పంటలను సాగు చేస్తోన్న లక్షలాది మంది రైతులు మరియు రైతు శ్రామికుల ప్రయోజనాల కోసం కృషి చేస్తోన్న లాభాపేక్ష లేని సంస్ధ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసోసియేషన్స్‌ (ఫైఫా) నేడు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీకి కోట్పా సవరణ చట్టంను ఉపసంహరించుకోవాల్సిందిగా అభ్యర్ధించింది.
 
భారతీయ ఎఫ్‌సీవీ పొగాకు రైతుల కోసం కోట్పా మరణ శాసనంగా మారనుంది. ప్రతిపాదిత సవరణ బిల్లు 2020తో భారతదేశంలో సిగిరెట్ల అక్రమ రవాణాకు భారీ తోడ్పాటు లభించనుంది. ఈ ఫలితంగా, భారతీయ రైతులు సాగు చేసే పొగాకుకు డిమాండ్‌ గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయి. ఫైఫా ఇప్పటికే తమ అభ్యర్ధనలను సంబంధిత మంత్రిత్వ శాఖలు అయినటువంటి పీఎంఓ, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమలు, కార్మిక మంత్రిత్వ శాఖలకు సమర్పించింది.
 
గత కొద్ది సంవత్సరాలుగా, పొగాకుపై అత్యంత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. హెచ్చరికల బొమ్మల పరిమాణం పెంచడం, సిగిరెట్లపై భారీస్ధాయిలో పన్నులు విధించడం వంటివి ఉన్నాయి. 2012-13తో పోలిస్తే ఇప్పుడు మూడు రెట్లు అధికంగా పన్ను వేయడంతో పాటుగా ఎగుమతుల ప్రమోజనాలను సైతం ఉపసంహరించారు. ఇవన్నీ కూడా రైతుల జీవనోపాధిని దెబ్బతీసేటటువంటివే! మరీ ముఖ్యంగా పొడి, సారవంతం కాని నేలల్లో పొగాకు తరహాలో రాబడులు అందించే ప్రత్యామ్నాయ పంటలనేవీ చూపి రైతులకు సహాయపడలేదు.
 
ప్రస్తుతం, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాల్గవ అతిపెద్ద అక్రమ సిగిరెట్‌ మార్కెట్‌గా ఇండియా నిలుస్తుంది. గత దశాబ్దంన్నరలో అక్రమ సిగిరెట్‌ మార్కెట్‌ ఇక్కడ రెట్టింపయింది. దీనికారణంగా ఎఫ్‌సీవీ వ్యవసాయ సమాజం 6వేల కోట్ల రూపాయలను గత ఏడేళ్లలో నష్టపోయింది.
 
ఈ బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా శ్రీ జవారీ గౌడ, అధ్యక్షులు, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసోసియేషన్స్‌ (ఫైఫా) మాట్లాడుతూ, ‘‘ప్రతిపాదిత బిల్లులోని సవరణలు వాణిజ్యవేత్తలు, వ్యాపారులను భయబ్రాంతులను చేసే రీతిలో ఉన్నాయి. సిగిరెట్ల విక్రయవ్యాపారం చేసేందుకు వారు భయపడవచ్చు. ఈ కారణం చేత, నేరపూరిత స్వభావం కలిగిన సిండికేట్లు అక్రమ సిగిరెట్‌ రవాణాకు పాల్పడటంతో భారతీయ అక్రమ సిగిరెట్లమార్కెట్‌లో వాటి వరదను కొనసాగించవచ్చు. ఈ తరహా అక్రమ సిగిరెట్ల నాణ్యత హీనంగా ఉండటంతోపాటుగా భారతీయ చట్టాలనేవీ ఇవి అనుసరించవు. అంతేకాదు, ప్రస్తుతం అక్రమా పొగాకు ఉత్పత్తి ప్యాకేజీలేవీ కూడా చట్టబద్ధమైన హెచ్చరికలను కలిగి ఉండవు. ఈ అక్రమ సిగిరెట్లలో దేశీయంగా సాగు చేసిన పొగాకు  వినియోగించకపోవడం వల్ల లక్షలాది మంది పొగాకు రైతుల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి’’ అని అన్నారు.
 
శ్రీ మురళి బాబు, జనరల్‌ సెక్రటరీ, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసొసియేషన్స్‌ (ఫైఫా) మాట్లాడుతూ, ‘‘సవరణ బిల్లులో ఎఫ్‌సీటీసీ యొక్క నిబంధనలన్నీ కూడా పూర్తి శక్తివంతం కావడంతో పాటుగా కొన్ని సందర్భాలలో ఎఫ్‌సీటీసీ కోరుకున్న దాని కన్నా అధికంగా కోరుకుంటుంది. అయితే,  ప్రతిపాదిత కఠిన చట్టాల వల్ల సమస్యలు ఎదుర్కొనబోయే పొగాకు రైతలకు సంబంధించి ఇప్పటివరకూ వాస్తవ సమస్యలపై ఎలాంటి చర్చలు లేదా చర్యలూ తీసుకోలేదు. గౌరవనీయ ప్రధానమంత్రి దృష్టికి ఈ అంశాలను తీసుకురావడంతో పాటుగా ప్రతిపాదిత కఠిన చట్టాల వల్ల కలిగే ప్రభావాన్ని సైతం ఆయన దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
 
ప్రపంచంలో అత్యధికంగా పొగాకు పండించే దేశాలలో ఇండియా రెండవ స్థానంలో ఉంది. దేశంలో పొగాకును 13 రాష్ట్రాలలో సాగు చేస్తుండటంతో పాటుగా 4.57 కోట్ల మంది దీనిపై ఆధారపడ్డారు. జీవనోపాధి కోసం పొగాకుపై ఇంత భారీ స్ధాయిలో ప్రజలు మరే దేశంలోనూ ఆధారపడి లేరు.
 
యశ్వంత్‌ చీడిపోతు, నేషనల్‌ స్సోక్స్‌పర్సన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ఫార్మర్‌ అసొసియేషన్స్‌ (ఫైఫా) మాట్లాడుతూ ‘‘స్వార్థ ప్రయోజనాలను ఆశించి కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని  తప్పుదారి పట్టిస్తున్నాయని మేము నమ్ముతున్నాము. పొగాకు నియంత్రణ ఉద్యమకారులు మరియు ఎన్‌జీవోల వాస్తవ ఎజెండాపై ప్రభుత్వం తగిన పరిశోధన చేయాలి. ఈ సంస్థలే తప్పుడు ప్రచారం చేయడంతో పాటుగా పలు చోట్ల సమస్యలనూ సృష్టిస్తూ చట్టబద్ధమైన పొగాకు వ్యాపారం, ఉత్పత్తులకు అవరోధం కలిగిస్తున్నారు’’ అని అన్నారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల శ్రద్ధ వహించే విధాన నిర్ణేతలను, ప్రతిపాదిత సవరణలేవీ తీసుకురావద్దని ఎఫ్‌సీవీ ఫార్మింగ్‌ సమాజం అభ్యర్ధిస్తుంది.