మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (10:46 IST)

భారత్‌ వ్యాక్సిన్‌పై నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ వెళ్లిపోండి: బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

యుపి బిజెపి మీరట్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు.

మన దేశం మీద, ఇక్కడి శాస్త్రవేత్తల మీద నమ్మకంలేని వారు పాకిస్తాన్‌ దారి చూసుకోవచ్చంటూ పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధమైన సమయంలో టీకాపై వస్తున్న వందతులను ఉద్దేశించి మీరట్‌ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానంగా కరోనా వ్యాక్సిన్‌ తయారీలో పంది మాంసం వినియోగించారంటూ ఒక వర్గానికి చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.