నానీ హిందువా... లేక పాకిస్తాన్ వాడా?: ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు

buddha naga jagadiswararao
ఎం| Last Updated: గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:50 IST)
మతాల మధ్య చిచ్చురేపుతూ, దేవుళ్లను బొమ్మలతో, చెక్కలతో పోలుస్తున్న కొడాలినాని అసలు హిందువా... లేక పాకిస్తాన్ వాడా అన్న సందేహం కలుగుతోందని, ఆయనకు ఆలోచనా జ్ఞానం నశించిందేమోనన్న అనుమానం కూడా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

గురువారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. “దుర్గగుడిలో సింహపు ప్రతిమలు మాయమైతే, ఏంపోయింది... వాటి ఖరీదు 6, 7 లక్షలేకదా” అనడం, అంతర్వేదిలో రథం దగ్ధమైతే, “కోటిరూపాయలు ఇస్తున్నాం కదా” అంటూ ఏదిపడితే అది మాట్లాడుతున్న నానీని, తక్షణమే పిచ్చాసుపత్రిలో చేర్చాలన్నారు.

డబ్బు, అధికారం మదంతోనే నానీ నోటికి పనిచెబుతున్నాడని, అటువంటి వ్యక్తి ప్రజలమధ్యన ఉంటే ప్రమాదమన్నారు. చేతికి రక్షదారాలు కట్టుకుంటూ, మెడలో రుద్రాక్షలు ధరించిన నానీ మాటలు చూస్తుంటే, చేతలకు మాటలకు పొంతనలేకుండా పోయిందన్నారు.

దేవాలయాలకు, దేవాలయ భూములకు వైసీపీప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని, హిందువల మనోభావాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న కొడాలినానీ జగన్ తక్షణమే మంత్రివర్గంనుంచి తొలగించాలని జగదీశ్వరరావు డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ మెప్పుపొందడం కోసమే నానీ,హిందూమతాన్ని కించపరుస్తూ, హిందువులను అవహేళన చేస్తున్నాడన్నారు. కొడాలినానీలాంటి వారు మంత్రివర్గంలో ఉంటే, జగన్ కే నష్టమన్న టీడీపీఎమ్మెల్సీ, ఆయనపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.

జగన్ నానీపై చర్యలు తీసుకోకుంటే, ఆయన మద్ధతుతోనే కొడాలి మాట్లాడుతున్నట్లు భావించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.
దీనిపై మరింత చదవండి :