1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Twitter to ban all political advertising

ఇకపై రాజకీయ ప్రకటనలకు స్వస్తి : ట్విట్టర్ సంచలన నిర్ణయం

Twitter
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రకటనలకు స్వస్తి చెప్పాలని భావిస్తోంది. అయితే, రాజకీయ వార్తల సందేశాలకు మాత్రం అనుమతి ఇవ్వనుంది. 
 
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారాల షేర్ చేయడం అధికమైపోయింది. దీంతో ఇలాంటి వార్తలను కట్టడి చేయడానికి ట్విట్టర్ చర్యలు చేపట్టింది. ఇకపై ట్విట్టర్ వేదికగా ఎలాంటి రాజకీయ ప్రకటనలకు ఆస్కారం లేకుండా.. అన్ని రకాల పొలిటికల్ అడ్వర్టైజ్‌మెంట్‌లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నిషేధం నవంబరు 22 నుంచి అమల్లోకి రానున్నట్లు ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే తెలిపారు. అయితే ఈ నిషేధానికి సంబంధించిన పూర్తి వివరాలను నవంబరు 15వ తేదీన వెల్లడిస్తామని తెలిపారు. తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 'రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప.. వాటిని కొనకూడదు' అంటూ ట్వీట్ చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఉద్యోగులకు షాకివ్వనున్న కాగ్నిజెంట్... 7 వేల మంది టెక్కీలకు ఉద్వాసన?!