శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (11:47 IST)

సమంత ట్వీట్.. అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన దేవునికి ధన్యవాదాలు..

సమంత.. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌‌లలో ఒకరుగా అదరగొడుతున్నారు. దీనికి తోడు ఇటీవల ఈ భామ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తన భర్త నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా ఈ యేడాది మొదట్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. 
 
తాజాగా దీపావళి సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో సమంత రాస్తూ.. దేవుడు దయతో మంచి ఆరోగ్యం, మంచి ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్‌ను ఇచ్చి ఆశీర్వదించాడని.. ఇంత అద్భుతమైన జీవితాన్ని తనకు ఇచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలంటూ రాసుకున్నారు. అంతేకాదు పండుగ పూట తన ఫ్యామిలీతో దిగిన ఓ అపురూపమైన ఫోటోను షేర్ చేశారు.
 
సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.