శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (10:37 IST)

పునర్నవి భూపాలం.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది...

పునర్నవి భూపాలం బిగ్ బాస్ హౌస్ కంటిస్టంట్. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి వెలుపలికి వచ్చేసింది. వచ్చినప్పటి నుంచి పబ్‌లు,  పార్టీలంటూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే బీచ్‌ల వెంట సేదతీరుతూ కాలం గడుపుతోంది. ప్రస్తుతం పునర్నవి దీపావళి సంబరాల్లో మునిగిపోయింది. దీపావళీ సందర్బంగా పున్ను ప్రమిదలు వెలిగిస్తూ.. అదిరిపోయే డ్రెస్‌లో ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి .
 
కాగా, ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్ తరుణ్, అవికాగోర్ హీరో హీరోయిన్స్‌గా చేశారు. ఆ తర్వాత పునర్నవి.., శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో హీరో కూతురుగా నటించింది. ఆ మద్య ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడ యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది. తాజాగా బిగ్ బాస్‌లో ఓ కంటెస్టెంట్‌‌గా పాల్గొన్న విషయం తెలిసిందే.